TSRTC: శబరిమల భక్తులకు TSRTC గుడ్‌న్యూస్.. వారికి మాత్రమే ఉచిత ప్రయాణం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karimnagar: ప్రతి ఏడాది అయ్యప్ప భక్తులు కార్తీక మాసంలో మాలను ధరించి దీక్ష చేపట్టి భక్తి శ్రద్ధలతో ఆ మణికంఠ స్వామిని ఆరాధిస్తారు. 41 రోజులు నియమ నిష్ఠలతో దీక్ష చేపట్టిన స్వాములు 41 రోజుల తరువాత శబరిమలకు వెళ్లి అయ్యప్ప స్వామిని దర్శించుకుని ముడుపు చెల్లించి దీక్షను విరమిస్తారు. అయితే కేరళ లోని శబరిమలకు వెళ్లేందుకు భక్తులు ప్రయివేట్ బస్సుల్లో, ట్రైన్లలో ప్రయాణిస్తుంటారు. కానీ కార్తీక మాసంలో హిందువుల్లో చాలామంది అయ్యప్ప మాలను ధరిస్తారు. కనుక భక్తులందరూ ఆ సమయంలో శబరిమలకు చేరుకునేందుకు ప్రయత్నిస్తారు. దీనితో చాలా మందికి ట్రైన్ టికెట్లు దొరకవు.. అలాంటి వాళ్ళు ప్రైవేట్ ట్రావెల్స్ ని సంప్రదిస్తారు. ఈ క్రమంలో కార్తీక మాసం సిజన్ కావడం చేత టికెట్ ధర అధికంగా ఉంటుంది. ఇది ప్రతి సంవత్సరం భక్తులు ఎదుర్కునే సమస్యే.
Read also:Delhi Pollution: ఢిల్లీలో వాయుకాలుష్యం.. 24గంటల్లో 10తక్షణ చర్యలు
Also Read
- Adilabad RIMS Fire : రిమ్స్ విషాదం.. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు.!
- Food Safety : ఎక్స్పైరీ మసాలాలకు కొత్త తేదీలు.. దిల్ బహార్ యూనిట్‌పై ఎస్వోటీ దాడి
- Janasena Party: జనసేన తెలంగాణలో కొత్త కమిటీ.. జాయినింగ్ కమిటీ కన్వీనర్‌గా ప్రేమ్ కుమార్
- Ganesh Visarjan : గణేష్ నిమజ్జనానికి సెలవు.. ఆ రోజు మాత్రం పని.!
అయితే ఈ ఏడాది ఆ సమస్యను పరిష్కరిస్తూ.. అయ్యప్ప భక్తులకు టీఎస్ ఆర్టీసీ గుడ్‌న్యూస్ చెప్పింది. శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ అద్దె ప్రాతిపదికన సూపర్‌లగ్జరీ బస్సులు సమకూర్చేందుకు సిద్ధమైంది. ఈ నేపధ్యంలో కరీంనగర్ రీజియన్ రీజినల్ మేనేజర్ ఎన్.సుచరిత మాట్లాడుతూ.. సుశిక్షితులైన డ్రైవర్లతో, భద్రమైన ప్రయాణానికి అవకాశం కల్పిస్తూ.. టీఎస్ ఆర్టీసీ అద్దె ప్రాతిపదికన సూపర్‌లగ్జరీ బస్సులు సమకూర్చనుందని తెలిపారు. కాగా ఈ సూపర్ లగ్జరీ బస్సుల్లో టీవీ సౌకర్యం కూడా ఉందని పేర్కొన్నారు. కాగా ప్రయాణంలో ఇద్దరు మణికంఠ స్వాములకు, ఇద్దరు వంటమనుషులకు, సామాన్లు సర్దేందుకు ఓ వ్యక్తికి ఉచితంగా ప్రయాణించడానికి అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు.
Read also:
అలానే ఆర్టీసీ బస్సును అద్దెకు బుక్ చేసిన గురుస్వామికి ఉచిత ప్రయాణం ఉంటుందని.. అదే విధంగా ఒకటి కంటే ఎక్కువ బస్సులు బుక్ చేసిన గురుస్వామికి ఆ బస్సులపై రోజుకు రూ.300 చొప్పున కమీషన్ కూడా ఇస్తామని వెల్లడించారు. కాగా శబరిమలకు వెళ్లే దారిలో ఇతర పుణ్యక్షేత్రాలు కూడా దర్శించుకునే వెసులుబాటు ఉంటుందని.. మరిన్ని వివరాలకు సమీపంలో డిపో మేనేజర్లను సంప్రదించాలని ఆర్ఎం కోరారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా లోని అయ్యప్ప భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
తాజావార్తలు
-
Off The Record : ఎన్నికల కోసం బీఆర్ఎస్ EXTRA కేర్ తీసుకుంటుందా?
-
ICC Rankings: మారిన టీ20, వన్డే ఐసీసీ ర్యాంకింగ్ లిస్ట్.. ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ స్థానాలు ఇవే..
-
CDSCO Warning : పెయిన్ కిల్లర్లు, యాంటీబయోటిక్స్‌తో జాగ్రత్త.. కిడ్నీలకు ముప్పు!
-
Pandu Mirapakaya Pachadi: ఏడాది దాటినా అదే ఘాటు, అదే రుచి! పక్కా కొలతలతో పండు మిరపకాయ పచ్చడి ఇలా పెట్టేయండి..
-
Story Board: సర్ పేరుతో ఏమిటీ ప్రహసనం..? సామాన్యుల దగ్గర్నుంచీ వీవీఐపీల దాకా ఎవర్నీ వదలరా..?
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!