Supreme Court: ఎన్నారై కోటా ముసుగులో మోసానికి యత్నం!
- మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్‌లో ఎన్‌ఆర్‌ఐ బంధువులకు రిజర్వేషన్లు కల్పించాలన్ని పంజాబ్
- ఈ పిటిషన్ ను కొట్టేసిన హర్యానా హైకోర్ట్
- సుప్రీంకోర్టును సంప్రదించిన ప్రభుత్వం
- ప్రభుత్వానికి అత్యున్నత న్యాస్థానం చివాట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్‌లో ప్రవాస భారతీయుల (ఎన్‌ఆర్‌ఐ) దూరపు బంధువులకు రిజర్వేషన్లు కల్పించడం మోసమని పంజాబ్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు మందలించింది. ఇది మోసమని, దీన్ని అరికట్టాలని చూచించింది. మెడికల్ కాలేజీల్లో ఎన్నారై కోటాను పెంచాలన్న పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించడంతో పంజాబ్ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఎన్‌ఆర్‌ఐల దూరపు బంధువులకు అడ్మిషన్‌లో రిజర్వేషన్ ప్రయోజనం కల్పించరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మోసం ఆగాలంది. 2025-26 విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 15% ఎన్‌ఆర్‌ఐ కోటాను ప్రవేశపెట్టాలని కర్ణాటక ప్రభుత్వం ఒత్తిడి చేస్తున్న తరుణంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
నోటిఫికేషన్‌ను హైకోర్టు రద్దు చేసింది
Also Read
- Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్‌కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
- Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
- Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
- North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మెడికల్ కాలేజీల్లో ఎన్‌ఆర్‌ఐ కోటా ద్వారా ప్రవేశానికి నిబంధనలను సవరిస్తూ పంజాబ్ ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌ను ఈ నెల ప్రారంభంలో పంజాబ్, హర్యానా హైకోర్టు కొట్టివేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ షీల్ నాగు, జస్టిస్ అనిల్ క్షేత్రపాల్‌లతో కూడిన ధర్మాసనం ఆగస్టు 20న రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఎన్‌ఆర్‌ఐ అభ్యర్థులకు దూరపు బంధువులను చేర్చేలా నిర్వచనాన్ని విస్తృతం చేస్తూ ‘పూర్తిగా అసమంజసమైనది’ అని తీర్పు చెప్పింది.
ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యలు..
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ మాట్లాడుతూ.. ‘‘ప్రవేశాల సమయంలో ఎన్‌ఆర్‌ఐ దగ్గరి బంధువును కూడా పరిగణనలోకి తీసుకుంటామని మీరు చెప్తున్నారు. అసలు అదేంటి..? ఇదంతా ఆదాయం పొందే వ్యూహం’’ అని వ్యాఖ్యానించారు. మరో న్యాయమూర్తి జస్టిస్ జేబీ పార్దివాలా కూడా హైకోర్టు తీర్పును సమర్థించారు. ‘‘ఈ ఎన్‌ఆర్‌ఐ కోటా బిజినెస్‌ను మనం ఆపివేయాలి. ఇది పూర్తిగా మోసం. మీరు చెప్తున్న అభ్యర్థితో పోల్చుకుంటే.. మూడు రెట్లు ఎక్కువ మార్కులు వచ్చిన వారికి అడ్మిషన్ దొరకదు. సదరు అభ్యర్థులందరూ భారతీయులే.. కానీ వారు కేవలం ఎన్‌ఆర్‌ఐకు బంధువులు’’ అంటూ సుప్రీం ధర్మాసనం ఈ నిబంధనను తప్పుపట్టింది. చట్టవిరుద్ధమైన వాటిని కోర్టు నిస్సంకోచంగా తోసిపుచ్చుతుందని పేర్కొంది.
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్‌కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!