మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్‌లో ప్రవాస భారతీయుల (ఎన్‌ఆర్‌ఐ) దూరపు బంధువులకు రిజర్వేషన్లు కల్పించడం మోసమని పంజాబ్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు మందలించింది. ఇది మోసమని, దీన్ని అరికట్టాలని చూచించింది. మెడికల్ కాలేజీల్లో ఎన్నారై కోటాను పెంచాలన్న పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించడంతో పంజాబ్ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఎన్‌ఆర్‌ఐల దూరపు బంధువులకు అడ్మిషన్‌లో రిజర్వేషన్ ప్రయోజనం కల్పించరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.…