Brahmanandam:కర్ణాటక ఎన్నికల రణరంగం మొదలయ్యింది. ఎవరి పార్టీలు వారు తమ ప్రత్యర్థులపై గెలవడానికి ఎత్తులు.. పై ఎత్తులు వేస్తున్నారు. ఇక నాయకులుగా పోటీల్లో ఉన్నవారు క్యాంపైన్ లో చలాకీగా తిరుగుతున్నారు.. ఇంకొంతమంది తాము ప్రజలకు ఏం చేయబోతున్నాం అనేది చెప్తూ ఓట్లు అడుగుతున్నారు. ఇక ఎన్నికల క్యాంపైన్ లో సినీ తారలు మెరవడం సాధారణమే.. కన్నడలో ఇప్పటికే సినీ తారలు.. తాము సపోర్ట్ చేస్తున్న పార్టీలకు ప్రత్యేక్షంగానో, పరోక్షంగానో సహాయపడుతున్నారు. తాజాగా టాలీవుడ్ స్టార్ కమెడియన్, హాస్య బ్రహ్మ బ్రహ్మానందం కన్నడ రాజకీయాల్లోకి దిగారు. బీజేపీ కోసం ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గున్నారు. చిక్ బళ్లాపూర్ బీజేపి అభ్యర్థి సుధాకర్ కి మద్దతు పలుకుతూ ఆయన నేడు చిక్ బళ్లాపూర్ ప్రజలతో సందడి చేశారు. వైద్యశాఖా మంత్రి Dr K సుధాకర్ ను గెలిపించాలని ఆయన రోడ్డు మీద తిరుగుతూ ప్రచారం చేశారు.చిక్ బళ్లాపూర్ నియోజక వర్గంలో చాలామంది తెలుగు మాట్లాడేవారే ఉండడంతో బ్రహ్మీ సైతం తెలుగులో మాట్లాడి మెప్పించారు.
Trivikram: సంయుక్తను వదలని త్రివిక్రమ్.. ఈసారి కూడా గట్టిగానే..?
” వైద్య శాఖలో ఎంతో మంచి పేరు తెచ్చుకున్న సుధాకర్ ను ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నాను. ఎన్నో వైద్య సేవలు అందించి .. కర్ణాటక గురించి దేశమంతటా మాట్లాడుకొనేలా చేసిన సుధాకర్ కు ఓటు వేయండి. మంచి తనం, సేవలు చూసి .. మాలాంటి వారందరు ఆయనకు అండగా నిలబడి గెలిపించడానికి మేము వచ్చాం.. ఆయనకు ఓటు వేసి గెలిపించండి” అని చెప్పుకొచ్చారు. ఇక ఖాన్‌తో గేమ్స్ ఆడొద్దు అంటూ తనదైన కామెడీ స్టైల్‌లో కర్ణాటక ఎన్నికల ప్రచారం ప్రారంభించిన బ్రహ్మానందం. ఇవాళ రాత్రి 10గంటల వరకు ప్రచారం చేయనున్నారు. అనంతరం రాత్రికి తిరిగి హైదరాబాద్‌కి చేరుకోనున్నారు. ఇక బ్రహ్మానందంను చూసిన అభిమానులు ఆయనతో సెల్ఫీల కోసం ఎగబడ్డారు. తెలుగు రాష్ట్రాల్లో ఏరోజుఏ పార్టీకి సపోర్ట్ చేయని బ్రహ్మీ.. ఇలా కర్ణాటక వెళ్లి.. బీజేపీ అభ్యర్థికి ప్రచారం చేయడం ఏంటి అని అభిమానులు మాట్లాడుకుంటున్నారు. అయితే ఇది ఆయనకు మొదటిసారి కాదు.. 2019 లో కూడా బ్రహ్మీ.. కర్ణాటక ఎలక్షన్ క్యాంపెయిన్ లో పాల్గొన్నారు. అప్పుడు కూడా Dr K సుధాకర్ ను గెలిపించాలని ఆయన ప్రచారం చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి.