తెలుగు నటశిఖరం నేలకొరిగింది. ఎన్నో అద్భుత చిత్రాలను పరిచయం చేసిన సూపర్ స్టార్ కృష్ణ నిన్న ఉదయం 4 గంటల సమయంలో మృతి చెందారు. అయితే.. నేడు సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు జరుగనున్నాయి. కృష్ణ మరణంతో తెలుగు చిత్రపరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన మృతికి సంతాపంగా నేడు షూటింగ్స్‌ను బంద్ చేస్తున్నట్లు టాలీవుడ్ నిర్మాతల మండి నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే సినీ, రాజకీయ ప్రముఖులు కృష్ణ భౌతికకాయానికి నివాళులు అర్పించారు. అయితే.. ప్రస్తుతం కృష్ణ భౌతిక కాయాన్ని పద్మాలయ స్టూడియో వద్ద అభిమానుల సందర్శనార్థం ఉంచారు.
Also Read :Software Employee: కుమారుడిని మందలించిన తల్లిదండ్రులు.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అదృశ్యం
అయితే.. ఈ సందర్భంగా ఎన్టీవో తో కృష్ణ మేకప్ మ్యాన్ మాధవరావు మాట్లాడుతూ.. దేవుడి లాంటి వ్యక్తిని కోల్పోయానన్నారు. ఆయన చేసిన ప్రతి సినిమాకి నేను మేకప్ వేసానని, చివరి సారి శ్రీశ్రీ సినిమా కు మేకప్ వేసానన్నారు. కృష్ణ గారి వద్ద పని చేయడం గొప్ప వరమని మాధవరావు అన్నారు. మేకప్ వేసే సమయంలో పూర్తిగా మీ ఇష్టం అంటూ మాకు వదిలేస్తారని, జేమ్స్ బాండ్, కౌ బాయ్, అల్లూరి సీత రామ రాజు మేకప్ వేయడానికి సమయం పట్టినా ఎంతో ఓర్పుగా ఉండే వారన్నారు. ఒక సినిమాకి మేకప్ లేకుండా కృష్ణ గారు నటించాలి అని ఓ కెమెరామెన్ చెప్పారు.. అలానే నటించడానికి సిద్ధం అయ్యారన్నారు. ప్రతి అరిస్టుని దేవుడిల చూస్తారని ఆయన వెల్లడించారు. కృష్ణ ఒక పుస్తకమని, కృష్ణ గారి నుండి ఈ తరం చాలా నేర్చుకోవాలని ఆయన అన్నారు.