మధ్యప్రదేశ్‌లోని దిండోరి జిల్లాలో షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. ఐదు నెలల గర్భిణిని ఆసుపత్రి బెడ్‌పై ఉన్న రక్తాన్ని శుభ్రం చేయించారు ఆస్పత్రి సిబ్బంది. అంతకుముందు.. ఆ బెడ్ పై తన భర్త చనిపోయి ఉన్నాడు. ఈ క్రమంలో.. క్లీన్ చేయాలని తనపై ఒత్తిడి చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.