రష్యాలో గత వారం భారీ భూకంపం బెంబేలెత్తించింది. రిక్టర్ స్కేల్‌పై 8.8 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. వెంటనే సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. రష్యాతో పాటు అమెరికా, జపాన్, న్యూజిలాండ్ దేశాలకు జారీ అయ్యాయి.
Hyderabad : హైదరాబాద్ నగరంలోని శ్రీ సీతారాముల ఆలయంలో జూన్ 17వ తేదీ సోమవారం గుర్తుతెలియని దుండగులు హిందూ దేవుళ్ల విగ్రహాలను ధ్వంసం (damaged ) చేశారు. ఈ విషయం కాస్త ఆలస్యంగా బయటికి వచ్చింది. ఈ ఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దుబిల్‌పురా గ్రామంలో చోటుచేసుకుంది. శ్రీ సీతారాముల ఆలయంలోని సీతారామ లక్ష్మణ విగ్రహాలను కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారని స్థానికులు ఆరోపించారు. దుండగులు రాత్రి సమయంలో ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు అక్కడి…
పంజాబ్‌లో వందే భారత్ రైలుపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఫగ్వారాలో అమృత్‌సర్ నుంచి ఢిల్లీ వెళ్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుపై ఈరోజు రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో ప్రయాణికులకు ఎలాంటి గాయాలు జరగలేదు కానీ.. వందే భారత్ రైలు కిటికీలు ధ్వంసమయ్యాయి.
తెలంగాణ రాష్ట్రంలో మంత్రులు, సీఎం నిర్లక్ష్యం వల్లే లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బ తిన్నాయి అని బీజేపీ నేత ఈటల రాజేందర్ ఆరోపించారు. ఇసుక మేటలు పెట్టారు.. అన్నారం, కాళేశ్వరం ప్రాజెక్టుల్లో బ్యాక్ వాటర్ వల్ల వేల ఎకరాల పంటలు మునుగుతున్నాయి.
సీఎం కేసీఆర్ తెలంగాణలో లేకుంటే చెట్లు లేక పర్యావరణం దెబ్బతినేదని మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. ఒక లక్ష మొక్కల మెగా ప్లాంటేషన్ లో భాగంగా నల్లగొండ జిల్లాలోని దేవరకొండ రోడ్డులో మంత్రి జగదీష్ రెడ్డి మొక్కలు నాటారు.