పంజాబ్‌లో వందే భారత్ రైలుపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఫగ్వారాలో అమృత్‌సర్ నుంచి ఢిల్లీ వెళ్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుపై ఈరోజు రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో ప్రయాణికులకు ఎలాంటి గాయాలు జరగలేదు కానీ.. వందే భారత్ రైలు కిటికీలు ధ్వంసమయ్యాయి.
హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఇంటిపై దాడి జరిగింది. ఢిల్లీలోని ఒవైసీ ఇంటిపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. నిన్న సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో దుండగులు ఈ ఘటనకు పాల్పడ్డారు.