స్టార్ హీరోలంతా తమ పిల్లల్ని హీరోలుగానో, హీరోయిన్లుగానో చూడాలనుకుంటున్నారు. కిడ్స్ కూడా పేరెంట్స్ అడుగు జాడల్లో నడుస్తుంటారు. కానీ నెపో కిడ్స్ విమర్శల వేళ తమ టాలెంట్‌తో పైకి రావాలని ట్రై చేస్తున్నారు. యాక్టర్స్ పిల్లలు యాక్టర్లే కావాలా ఏంటీ అంటూ ప్రశ్నిస్తున్నారు షారూఖ్ ఖాన్ తనయడు ఆర్యన్, సూర్య డాటర్ దియా సూర్య, దళపతి విజయ్ సన్ జేసన్ సంజయ్. మొహానికి మేకప్ కాదు మెగా ఫోన్‌పై ఫోకస్ చేస్తున్నారు. వీరిలో ఇప్పటికే కింగ్ ఖాన్ సన్ ఆర్యన్ బ్యాడ్ ఆఫ్ బాలీవుడ్ వెబ్ సిరీస్‌తో ఫ్రూవ్ చేసుకున్నాడు. కొడుకును హీరోగా కాకుండా డైరెక్టురుగా నిలిపేందుకు బాద్ షా పెద్ద తతంగమే నడిపాడు కానీ దర్శకుడిగా ఆర్యన్ ఓకే అనిపించుకున్నాడు.
కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ సన్ జేసన్ సంజయ్ తండ్రి నటనా వారసత్వాన్ని కాదని, మెగా ఫోన్ పడుతున్నాడు. కెమెరా ముందు కన్నా వెనుక ఉండేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నాడు. టొరంటో ఫిల్మ్ స్కూల్, సెంట్రల్ ఫిల్మ్స్ స్కూల్లో ట్రైనప్ అయిన జేసన్ లాస్ట్ ఇయర్ సందీప్ కిషన్ హీరోగా ఓ ప్రాజెక్ట్ పట్టాలెక్కించాడు. ఈ సినిమాను లైకా నిర్మిస్తోంది. షారూఖ్, దళపతి తనయులే కాదు. కోలీవుడ్ మరో స్టార్ హీరో సూర్య తనయ చిన్న వయస్సులోనే మెగా ఫోన్ పట్టి లీడింగ్ లైట్ అనే డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ తెరకెక్కించింది. మహిళా లైటింగ్ టెక్నీషియన్స్ కష్టాలను చూపించింది దియా. రీసెంట్‌గా లాస్ ఏంజెల్స్ లోని రెజెన్సీ థియేటర్ లో ఆస్కార్ క్వాలిఫయింగ్ రన్ లో భాగంగా ఈ చిత్రం ప్రదర్శితమైంది. నటన కన్నా దర్శకురాలిగా ఆమెకున్న ఇంటస్ట్ర్ తెలుసుకున్న పేరేంట్స్ సూర్య అండ్ జ్యోతిక ఈ డాక్యుమెంటరీ ఫిల్మ్ నిర్మించారు. ఇలా స్టార్ హీరోల పిల్లలు.. నటనా వారసత్వాన్ని కాదని.. దర్శకత్వంపై ఫోకస్ చేస్తూ ఇండస్ట్రీలో సక్సెస్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు.