తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు రీసెంట్ గా గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఆ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.. ఇప్పుడు దర్శక ధీరుడు రాజమౌళితో సినిమా చేయబోతున్నాడు.. గ్రాండ్ స్కేల్‍లో అడ్వెంచర్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాగా ఈ మూవీ తెరకెక్కనుంది.. ట్రిపుల్ ఆరోగ్యం తర్వాత జక్కన్న క్రేజ్ హాలివుడ్ రేంజుకు వెళ్లింది.. ఆయన నుంచి నెక్స్ట్ ఎప్పుడు సినిమా వస్తుందా అని వెయిట్ చేస్తున్నారు.. ఇప్పుడు మహేష్ బాబుతో తీస్తున్న సినిమా ఆ రేంజ్ లో ఉంటుందని తెలుస్తుంది..
SSMB29 సినిమా కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.. ఈ తరుణంలో ఈ చిత్రంలో మహేశ్ బాబు పాత్ర గురించి ఓ సమాచారం బయటికి వచ్చింది. ఈ సినిమాలో మహేశ్ బాబు డ్యుయల్ రోల్ చేయనున్నారని ఓ వార్త చక్కర్లు కొడుతుంది.. మహేష్ బాబు డ్యూయల్ ఎలా ఉంటుందో అని ఫ్యాన్స్ ఆసక్తి కనబరుస్తున్నారు.. అయితే, ఈ విషయంపై ఇంకా అధికారిక సమాచారం రావాల్సి ఉంది..
రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలిలో ప్రభాస్ రెండు పాత్రల్లో కనిపించారు.. విక్రమార్కుడు చిత్రంలో రవితేజ కూడా రెండు పాత్రల్లో కనిపించారు. అయితే, ఇప్పుడు పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కించనున్న సినిమాలో మహేశ్ బాబును కూడా డ్యుయల్ రోల్‍లో చూపించబోతున్నారనే వార్త ఫిలిం ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది.. కానీ దీనిపై మేకర్స్ స్పందించలేదు.. ఈ సినిమా కోసం మహేశ్ బాబు కొత్త లుక్‍లో కనిపించనున్నారని సమాచారం..ఈ చిత్రంను హాలీవుడ్ రేంజ్ లో తెరకేక్కించబోతున్నారు.. ఈ సినిమా కోసం ప్రిన్స్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు..