Srisailam Temple: శ్రీశైలం భక్తులకు శుభవార్త.. నేటి నుంచి ఉచిత స్పర్శ దర్శనం!
- శ్రీశైలం భక్తులకు శుభవార్త
- నేటి నుంచి శ్రీశైలంలో ఉచిత స్పర్శ దర్శనం
- సంప్రదాయ వస్త్రధారణ తప్పనిసరి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీశైలం వెళ్లే భక్తులకు శుభవార్త. ఈరోజు నుంచి మల్లన్న స్పర్శ దర్శనం తిరిగి ప్రారంభం కానుంది. సామాన్య భక్తులకు వారంలో 4 రోజులు ఉచిత స్పర్శదర్శనం కల్పించాలని దేవస్థానం కమిటీ నిర్ణయించిన విషయం తెలిసిందే. మంగళవారం నుంచి శుక్రవారం వరకు మధ్యాహ్నం 1.45 నుంచి 3.34 గంటల వరకు భక్తులు స్వామిని తాకే అవకాశం ఉంది. స్పర్శ దర్శనం సమయంలో సంప్రదాయ వస్త్రధారణ తప్పనిసరి అన్న విషయం గుర్తుంచుకోవాలి.
Also Read: AP Liquor Scam: కాలమే అన్నిటికీ సమాధానం చెబుతుంది.. జైలు వద్ద మరోసారి చెవిరెడ్డి హంగామా!
Also Read
రోజుకు వేయి మంది భక్తులకు ఉచిత స్పర్శ దర్శనంకు అవకాశం ఉంటుంది. కంప్యూటరైజ్డ్ టోకెన్ విధానం ద్వారా రోజుకు 1,000 మందికి దర్శనం కల్పిస్తారు. ఆధార్ కార్డ్ గుర్తింపు ద్వారా టొకన్లు జారీ చేస్తారు. టోకెన్‌లో భక్తుల పేరు, ఆధార్ నంబర్, ఫోన్ నంబర్, క్యూఆర్ కోడ్ ఉంటాయి. ఉత్సవాలు, పండుగలు, సెలవు రోజుల్లో స్పర్శ దర్శనం ఉండదు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు, ఉగాది, దసరా ఉత్సవాలు, శ్రావణ మాసం, కార్తీక మాసాల్లో ఈ దర్శనం ఉండదు. ఉచిత స్పర్శ దర్శనాన్ని మరలా పునఃప్రారంభిస్తున్నామని, దేవస్థానం దగ్గర టోకెన్లు ఇస్తారన్నారని దేవస్థానం ఈవో ఓ ప్రకటనలో తెలిపారు. భక్తులు ఏ రోజుకారోజు ఉచిత స్పర్శదర్శనం టోకన్లు తీసుకోవాల్సి ఉంటుందన్నారు.
తాజావార్తలు
-
The Paradise: వాయిదా లేదు.. చెప్పిన డేటుకే నాని సినిమా
-
Trump Hair: హెయిర్‌స్టైల్ మార్చేసిన ట్రంప్.. నెటిజన్లు కామెంట్లు
-
Python in Car: కారులో 7 అడుగుల కొండచిలువ.. బోనెట్ తెరవగానే షాక్..
-
ISRO: ‘‘ఇస్రో ప్రైవేటీకరణ కాదు’’.. ఉద్యోగులకు చైర్మన్ భరోసా..
-
Trump: న్యూ మెక్సికో రాష్ట్రం పేరు మార్చేందుకు ట్రంప్ ప్లాన్.. సాధ్యమేనా? రూల్స్ ఇవే!
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!