Danushka Gunathilaka: లైంగిక దాడి కేసులో లంక క్రికెటర్ గుణతిలకకు బెయిల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Danushka Gunathilaka: లైంగిక వేధింపుల కేసులో శ్రీలంక బ్యాటర్ దనుష్క గుణతిలకకు బెయిల్ మంజూరు అయింది. అతను సోషల్ మీడియా ఖాతాలను ఉపయోగించకుండా నిషేధించబడ్డాడని తెలుస్తోంది. డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన మహిళపై లైంగిక దాడికి పాల్పడినట్లు దనుష్కపై ఆరోపణలు ఉన్నాయి. ఆస్ట్రేలియాలో సిడ్నీలోని ససెక్స్ హోటల్లో ఐసీసీ టీ20 ప్రపంచకప్ టీమ్‌లో ఉన్న లంక క్రికెటర్‌ను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.
Koo: ట్విట్టర్‌కు పోటీగా స్వదేశీ యాప్ .. అమెరికాలో లాంచ్ కానున్న “కూ”
Also Read
- Aviation Fuel: విమాన ఇంధనంలో ఇథనాల్ కలుపుతున్నారంటూ ప్రచారం.. కేంద్రం క్లారిటీ
- Air India New CEO: దాదాపుగా పాకిస్తాన్ వెళ్లాల్సినవాడే, ఇప్పుడు ఎయిర్ ఇండియా కొత్త సీఈఓ..
- AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. పలు కొత్త విధానాలకు గ్రీన్ సిగ్నల్
- CJP: 'క్యా బోల్తీ పబ్లిక్'.. దేశవ్యాప్త ప్రచారానికి సీజేపీ సిద్ధం..
31 ఏళ్ల గుణతిలక నవంబర్ 2వ తేదీన 29 ఏళ్ల మహిళను లైంగికంగా వేధించినట్లు పోలీసులు వెల్లడించారు. అక్టోబర్ 29వ తేదీన డేటింగ్ యాప్ ద్వారా ఆ మహిళ గుణతిలకకు పరిచయం అయ్యింది. దనుష్కపై నాలుగు అభియోగాలు నమోదు చేశారు. ఇష్టం లేకుండా లైంగిక చర్యకు పాల్పడినట్లు అతనిపై కేసు బుక్ చేశారు. టీ20 వరల్డ్‌కప్ క్వాలిఫయింగ్ స్టేజ్‌లో నమీబియాతో మ్యాచ్‌లో గుణతిలక ఆడాడు. లంక జట్టు తరపున దాదాపు వందకుపైగా అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో ప్రాతినిధ్యం వహించాడు. లోకల్ కోర్టు బెయిల్ ఇవ్వకపోవడం వల్ల సుప్రీంను ఆశ్రయించగా బెయిల్ లభించింది. తాజా కేసు మళ్లీ జనవరి 12న విచారణకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
తాజావార్తలు
-
Aviation Fuel: విమాన ఇంధనంలో ఇథనాల్ కలుపుతున్నారంటూ ప్రచారం.. కేంద్రం క్లారిటీ
-
Air India New CEO: దాదాపుగా పాకిస్తాన్ వెళ్లాల్సినవాడే, ఇప్పుడు ఎయిర్ ఇండియా కొత్త సీఈఓ..
-
AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. పలు కొత్త విధానాలకు గ్రీన్ సిగ్నల్
-
Varun Tej: లెగసీపై.. మెగా ఫ్యామిలీ సఫోర్ట్పై వరుణ్ తేజ్ కీలక వ్యాఖ్యలు..
-
CJP: ‘క్యా బోల్తీ పబ్లిక్’.. దేశవ్యాప్త ప్రచారానికి సీజేపీ సిద్ధం..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!