Koo Set For US Launch, Aims To Take On Elon Musk’s Twitter: ట్విట్టర్ ను 44 బిలియన్ డాలర్ల డీల్ తో అపర కుబేరుడు ఎలాన్ మస్క్ సొంతం చేసుకున్నాడు. ట్విట్టర్ టేకోవర్ తర్వాత నుంచి సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే పలువురు కీలక ఉద్యోగులను తొలగించారు. దీంతో పాటు కంపెనీలో 50 శాతం ఉద్యోగులను తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో పాటు ట్విట్టర్ వెరిఫైడ్ అకౌంట్ కోసం నెలకు 8 డాలర్లు చెల్లించాల్సిందే అని స్పషం చేశారు.
ఇదిలా ఉంటే స్వదేశీ మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ‘కూ’ త్వరలో అమెరికాలో అడుగుపెట్టనుంది. ట్విట్టర్ కు పోటీగా ఇండియన్ యాప్ సవాల్ విసరబోతోంది. కంపెనీ ప్రపంచవిస్తరణను హైలెట్ చెస్తూ.. కూ సహవ్యవస్థాపకుడు చీఫ్ ఎగ్జిక్యూటివ్ అప్రమేయ రాధాకృష్ణ ట్విట్టర్ లో ఓ పోస్టు పెట్టాడు. ‘‘ నమ్మండి ఇది మన క్షణం.. లెట్స్ రాక్ ఇట్’’ అంటూ యూఎస్ఏలో మీకు తెలిసిన ప్రతీ ఒక్కరికి ‘కూ’ గురించి తెలియజేయండి అంటూ పోస్ట్ చేశాడు. కూ అమెరికాలో ప్రవేశించడం గురించి వచ్చిన ఓ వార్తా కథనాన్ని పంచుకున్నారు.
Read Also: Shraddha Walkar Case: శ్రద్ధా హత్య కేసులో కీలకంగా మారిన “వాటర్ బిల్”..
దీనిపై నెటిజెన్లు స్పందిస్తున్నారు. ‘మీరు విజయవంతం కావాలని’, ‘కంగ్రాట్స్ లెట్స్ కూ ఆల్ ద వే’ అంటూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 2020లో ప్రారంభించిన కూ యాప్ దాదాపుగా 5 కోట్ల డౌన్ లోడ్ లను సొంత చేసుకుంది. కూ భారతదేశంలోని అన్ని భాషల్లోకి విస్తరిస్తోంది. ప్రస్తుతం హిందీ, మరాఠీ, కన్నడ, బంగ్లా, తమిళం, తెలుగు, గుజరాతీతో సహా 10 భాషల్లో అందుబాటులో ఉంది. ప్రస్తుతం కంపెనీ అంతర్జాతీయ స్థాయిలోకి కూ ను తీసుకెళ్లాలని చూస్తున్నారు. ట్విట్టర్ కు ప్రత్యామ్నాయంగా ఏర్పడిన కూ యాప్ అమెరికాలో సత్తా చాటాలని అనుకుంటోంది. అమెరికాతో పాటు బంగ్లాదేశ్, ఫిలిప్పీన్స్, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా దేశాలకు కూ యాప్ తీసుకెళ్లాలని అనుకుంటున్నారు. ట్రూత్ సోషల్, గెట్ర్, మాస్టోడాన్, గాబ్, పార్లర్ వంటి ఇతర ప్లాట్‌ఫారమ్‌లను కూ అధిగమించిందని రాధాకృష్ణ పేర్కొన్నారు. గతేడాది కూ విలువ 150 మిలియన్ డాలర్ల నుంచి 260 డాలర్లకు పెరిగింది.
Believe! This is our moment! Let's rock it. Do let everyone you know in the US know about Koo 😇 pic.twitter.com/lPBDu5vCmJ
— Aprameya 🇮🇳 (@aprameya) November 16, 2022
Believe! This is our moment! Let's rock it. Do let everyone you know in the US know about Koo 😇 pic.twitter.com/lPBDu5vCmJ
— Aprameya 🇮🇳 (@aprameya) November 16, 2022