Supreme Court: సీజేపీ ఢిల్లీ ఆందోళనలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
- CJP నిరసనకు ముందు ఢిల్లీలో విధించిన ఆంక్షలపై సుప్రీంకోర్టులో పిటిషన్
- 57 మెట్రో స్టేషన్ల మూసివేత అంశం కోర్టు దృష్టికి
- ఢిల్లీకి వచ్చే పలు రైళ్ల రద్దుపైనా కపిల్ సిబల్ అభ్యంతరం
- ‘‘నిరసన హక్కు ఉంది.. కానీ చట్ట పరిధిలోనే’’ అని జస్టిస్ జాయ్మాల్య బాగ్చి వ్యాఖ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court: శనివారం కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) ఢిల్లీలో భారీ నిరసనకు పిలుపునిచ్చింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని, ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న SIR ప్రక్రియను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలకు సిద్ధమయ్యారు. సీజేపీతో పాటు లెఫ్ట్ పార్టీల విద్యార్థి సంఘాలు ఈ నిరసనల్లో పాల్గొంటున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఢిల్లీ పోలీసులు భద్రతా చర్యల్ని కట్టుదిట్టం చేశారు. శనివారం జరిగిన సీజేపీ నిరసన నేపథ్యంలో రాజధానిలోని 57 మెట్రో స్టేషన్లను మూసివేయాలని ఆదేశించడంతో పాటు, ఢిల్లీకి వచ్చే పలు రైళ్లను రద్దు చేశారు. ఈ నిరసనకు ఢిల్లీ పోలీసులు కూడా అనుమతి నిరాకరించారు.
ఆంక్షలపై కీలక విచారణ..
ఇదిలా ఉంటే, ఢిల్లీ ఆంక్షలపై శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్, భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు మెట్రో స్టేషన్ల మూసివేత, రైళ్ల రద్దు విషయాన్ని ప్రస్తావించి, ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోర్టును కోరారు. శాంతియుత నిరసన జరుగుతున్నప్పటికీ ఇలాంటి పరిస్థితి ఉందని ఆయన న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు. సీజేపీ తరుపున వాదించిన న్యాయవాదులు 16 పేజీల పత్రాలను కోర్టుకు సమర్పించారు. ఇందులో ఢిల్లీ పోలీసుల సలహాలు, బీఎన్ఎస్ సెక్షన్ 163 విధించడం, రైళ్ల రద్దు, యాప్ ఆధారిత టాక్సీలపై ఆంక్షలకు సంబంధించిన మీడియా నివేదికలు వంటి ఉన్నాయి.
Also Read
- Noida Airport: నోయిడా ఎయిర్‌పోర్టుకు ‘నరేంద్ర మోడీ’ పేరు.. యోగి కేబినెట్ ఆమోదం
- Thattanchavady Bypoll Result: తట్టాంచావడి ఉప ఎన్నిక ఫలితం.. 8,482 ఓట్ల మెజారిటీతో అశోక్ ఆనంద్ ఘన విజయం!
- Pinarayi Vijayan CMRL Case: మాజీ సీఎం పినరయి విజయన్‌కు హైకోర్టులో షాక్.. CMRL కేసులో FIRకు ఆదేశం!
- Cancer Medicines Price Update: క్యాన్సర్ మందుల ధరలపై కేంద్రం కీలక నిర్ణయం.. 70 శాతం వరకు తగ్గింపు?
దీనిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జయమల్య బాగ్చీ స్పందిస్తూ.. నిరసనలు, సమావేశాలు జరిపే హక్కును సమర్థిస్తూనే, ఇది చట్టపరిధిలో ఉండాలని అన్నారు. సమావేశాలు ఏర్పాటు చేసుకునే హక్కు ఉందంటూనే, దానిని చట్ట పరిధిలో చేసుకోవాలని చెప్పారు. నిరసనకారులైన సీజేపీ పోలీసుల నుంచి అనుమతి కోరగా, నిరాకరించినట్లు న్యాయవాదులు కోర్టుకు తెలియజేశారు. ఆంక్షలు గురించి ప్రస్తావిస్తూ జస్టిస్ బాగ్చీ.. నిరసనలకు అనుమతి ఉంటే చట్టబద్ధంగా జరుగుతుందని, చట్టాన్ని పూర్తిగా పాటించకపోయినా నిరసన తెలిపే హక్కును పూర్తిగా తోసిపుచ్చలేమని, అయితే చట్టానికి విరుద్ధంగా వ్యవహరిస్తే పరిణామాలకు బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు.
బ్యాలెన్స్ ఎలా..?
ఇదే సమయంలో ఆంక్షలు విధించడం, ప్రజల హక్కులను పరిరక్షించడం మధ్య సమతుల్యం అవసరమని ధర్మాసనం పేర్కొంది. నిరసనను నిలిపివేస్తే ప్రజలు సంఘటితమయ్యే హక్కును కూడా అడ్డుకున్నట్లు అవుతుందని అది న్యాయమా? అని ప్రశ్నించింది. ఇదే సమయంలో రెండింటి మధ్య బ్యాలెన్స్ ఎలా చేయాలి? అందుకు అవసరమైన వివరాలు ఇవ్వాలని పిటిషనర్లను ప్రశ్నించింది. నిరసన ఎవరు నిర్వహిస్తున్నారు. ఎంత మంది పాల్గొనే అవకాశం ఉందనే వివరాలను కూడా కోర్టు కోరింది. ప్రజల ప్రాథమిక హక్కులను కోరుతున్న పౌరుల వాదనతో పాటు నిరసన నిర్వాహకుల అభిప్రాయాలను కూడా వినాల్సి ఉంటుందని ధర్మాసంన పేర్కొంది. నిర్వాహకులు తమ ముందు లేకపోవడంతో పూర్తి వివరాలను తెలుసుకోవాల్సి ఉంటుందని అన్నారు.
తాజావార్తలు
-
Supreme Court: సీజేపీ ఢిల్లీ ఆందోళనలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
-
Noida Airport: నోయిడా ఎయిర్‌పోర్టుకు ‘నరేంద్ర మోడీ’ పేరు.. యోగి కేబినెట్ ఆమోదం
-
Pakistan Cricket Team: శ్రీలంకతో సిరీస్‌కు ముందు పాకిస్థాన్ జట్టులో కీలక మార్పులు.. కొత్త కెప్టెన్ నియామకం..
-
M.S Raju : ‘దేవి పుత్రుడు’ ఫెయిల్యూర్ తర్వాత ఆ కోపంతోనే అలా చేశా.!
-
Nani : నాని బ్యాక్ టు హోం గ్రౌండ్?
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు