Vicky Kaushal – Aditya Dhar : ఆగిపోయిన వందల కోట్ల ప్రాజెక్ట్.. విక్కీ కౌశల్ – ఆదిత్య ధర్ కాంబోకి బ్రేక్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vicky Kaushal – Aditya Dhar : బాలీవుడ్లో విక్కీ కౌశల్ దూకుడుకు బ్రేకులు వేయడం ఎవరి వల్లా కావడం లేదు. ‘యూరి’తో మొదలైన ఆయన సక్సెస్ జైత్రయాత్ర, ఇటీవల వచ్చిన ‘ఛావా’ వరకు నిర్విరామంగా కొనసాగుతోంది. సినిమా సినిమాకూ జోనర్ మార్చేస్తూ మినిమమ్ గ్యారెంటీ స్టార్‌గా మారిన ఈ టాలెంటెడ్ హీరో, ఇప్పుడు ఏకంగా పురాణాల బాట పట్టబోతున్నారు. అయితే ఇక్కడే ఒక ప్రాజెక్ట్ మూలనపడటం, మరో భారీ మైథాలజీ ప్రాజెక్ట్ పట్టాలెక్కడం సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. విక్కీకి కెరీర్ బెస్ట్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ ఆదిత్య ధర్‌తో కలిసి చేయాల్సిన అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘ది ఇమ్మోర్టల్ అశ్వత్థామ’. భారీ బడ్జెట్ కారణంతో కొన్నాళ్లు హోల్డ్‌లో పడిన ఈ కథ, పలువురు టాలీవుడ్ స్టార్ హీరోల చుట్టూ చక్కర్లు కొట్టి చివరకు మళ్లీ విక్కీ చేతులకే వచ్చిందన్న ప్రచారం సాగింది. కానీ విక్కీ ఉన్నపళంగా వరుస ప్రాజెక్టులతో బిజీ అయిపోవడంతో ఈ డ్రీమ్ ప్రాజెక్ట్ దాదాపు షెడ్‌కు వెళ్లినట్లే కనిపిస్తోంది. మరోవైపు దర్శకుడు ఆదిత్య ధర్ సైతం రణ్వీర్ సింగ్‌తో వేరే ప్రాజెక్ట్‌ను లైన్లో పెట్టే పనుల్లో పడటంతో ఈ కాంబో ఇప్పట్లో సెట్ అయ్యే అవకాశాలు కనిపించడం లేదు.
‘అశ్వత్థామ’ పక్కకు వెళ్లినప్పటికీ, మైథాలజీ జోనర్‌ను విక్కీ వదిలిపెట్టడం లేదు. ‘స్త్రీ 2’ ఫేమ్ డైరెక్టర్ అమర్ కౌశిక్ దర్శకత్వంలో అనౌన్స్ అయిన బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ‘మహావతార్’ను సెట్స్‌పైకి తీసుకెళ్లడానికి రంగం సిద్ధమైంది. చిరంజీవి పరశురాముడి జీవితం ఆధారంగా తెరకెక్కనున్న ఈ సినిమాను మ్యాడాక్ ఫిల్మ్స్ నిర్మిస్తోంది. వచ్చే ఏడాది (2027) జనవరి నుంచే ఈ క్రేజీ ప్రాజెక్ట్ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని మేకర్స్ స్పష్టం చేశారు. ప్రస్తుతం సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్న ‘లవ్ అండ్ వార్’ చిత్రంలో రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్‌లతో కలిసి నటిస్తున్న విక్కీ, ఆ రొమాంటిక్ వార్ డ్రామా పూర్తయిన వెంటనే పరశురాముడిగా గండ్రగొడ్డలి పట్టుకుని రంగంలోకి దిగనున్నారట. ఈ పౌరాణిక పోరాటం బాక్సాఫీస్ వద్ద ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.
Also Read
తాజావార్తలు
-
Vicky Kaushal – Aditya Dhar : ఆగిపోయిన వందల కోట్ల ప్రాజెక్ట్.. విక్కీ కౌశల్ – ఆదిత్య ధర్ కాంబోకి బ్రేక్!
-
Supreme Court: సీజేపీ ఢిల్లీ ఆందోళనలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
-
Noida Airport: నోయిడా ఎయిర్‌పోర్టుకు ‘నరేంద్ర మోడీ’ పేరు.. యోగి కేబినెట్ ఆమోదం
-
Pakistan Cricket Team: శ్రీలంకతో సిరీస్‌కు ముందు పాకిస్థాన్ జట్టులో కీలక మార్పులు.. కొత్త కెప్టెన్ నియామకం..
-
M.S Raju : ‘దేవి పుత్రుడు’ ఫెయిల్యూర్ తర్వాత ఆ కోపంతోనే అలా చేశా.!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు