No Cost EMI: నో-కాస్ట్ EMI నిజంగా ఉచితమేనా..? అబ్బో ఇంత కథ ఉందా.. తెలియాల్సింది చాలానే ఉంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పండుగల సీజన్ ప్రారంభం కావడంతో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ-కామర్స్ కంపెనీలు ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లు ఇస్తూ కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. మొబైల్స్, టీవీలు, ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషీన్లు వంటి వస్తువులను కొనుగోలు చేయడానికి బ్యాంకులు, కంపెనీలు ‘నో-కాస్ట్ ఈఎంఐ’ ఆఫర్లను విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. అయితే ఈ నో-కాస్ట్ ఈఎంఐ అనేది పూర్తిగా ఉచితం అనుకునే పొరపాటు చేయకూడదని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. వినడానికి చాలా సౌకర్యవంతంగా అనిపించినా, ఇది పూర్తిగా ఉచితం కాదు.
ఉదాహరణకు మార్కెట్లో ఒక మొబైల్ ఫోన్ అసలు ధర రూ. 1,00,000 అనుకుందాం. మీరు ఒకేసారి నగదు చెల్లించి ఆ ఫోన్ కొనుగోలు చేస్తే, దుకాణదారుడు లేదా కంపెనీ మీకు రూ. 6,000 డిస్కౌంట్ ఇస్తారు. అంటే మీకు ఆ ఫోన్ రూ. 94,000 కే వస్తుంది. అదే ఫోన్‌ను మీరు ‘నో-కాస్ట్ ఈఎంఐ’ (వడ్డీ లేకుండా) పద్ధతిలో తీసుకుంటే, మీకు ఆ రూ. 6,000 డిస్కౌంట్ రాదు. అంటే మీరు పూర్తి ధర రూ. 1,00,000 చెల్లించాల్సి వస్తుంది. ఇక్కడ కంపెనీ మీకు నేరుగా వడ్డీ వేయకపోయినా.. మీకు రావాల్సిన రూ. 6,000 డిస్కౌంట్‌ను ఇవ్వకపోవడం ద్వారా ఆ మొత్తాన్ని వడ్డీ రూపంలో రాబట్టుకుంటుంది. దీనికి తోడు, బ్యాంకులు లేదా ఈ-కామర్స్ సంస్థలు ఈఎంఐ ప్రాసెస్ చేయడానికి ప్రాసెసింగ్ ఫీజు, జీఎస్టీ (GST), ఇతర ఛార్జీలను విధిస్తాయి.
Also Read
- By Election Results: తమిళనాడు బైపోల్స్‌లో టీవీకే విక్టరీ.. బెంగాల్లో బీజేపీ ముందంజ
- Supreme Court: సీజేపీ ఢిల్లీ ఆందోళనలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
- Noida Airport: నోయిడా ఎయిర్‌పోర్టుకు ‘నరేంద్ర మోడీ’ పేరు.. యోగి కేబినెట్ ఆమోదం
- Pakistan Cricket Team: శ్రీలంకతో సిరీస్‌కు ముందు పాకిస్థాన్ జట్టులో కీలక మార్పులు.. కొత్త కెప్టెన్ నియామకం..
అందువల్ల కేవలం తక్కువ ఈఎంఐ వస్తోందని తొందరపడి నిర్ణయం తీసుకోకుండా, వస్తువు క్యాష్ ధర, ఈఎంఐ ద్వారా చెల్లించే మొత్తం, ప్రాసెసింగ్ ఫీజులు, వివిధ రకాల ఛార్జీలను క్షుణ్ణంగా బేరీజు వేసుకోవాలి. క్యాష్ కొనుగోలు ద్వారా ఎక్కువ ఆదా అవుతుంటే దానికి ప్రాధాన్యత ఇవ్వడం మంచిది. ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోకుండా లోన్ అగ్రిమెంట్ షరతులను పూర్తిగా చదివి, మీ అవసరాలు, బడ్జెట్‌కు తగినట్లుగా సరైన పేమెంట్ పద్ధతిని ఎంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
తాజావార్తలు
-
No Cost EMI: నో-కాస్ట్ EMI నిజంగా ఉచితమేనా..? అబ్బో ఇంత కథ ఉందా.. తెలియాల్సింది చాలానే ఉంది..
-
By Election Results: తమిళనాడు బైపోల్స్‌లో టీవీకే విక్టరీ.. బెంగాల్లో బీజేపీ ముందంజ
-
Vicky Kaushal – Aditya Dhar : ఆగిపోయిన వందల కోట్ల ప్రాజెక్ట్.. విక్కీ కౌశల్ – ఆదిత్య ధర్ కాంబోకి బ్రేక్!
-
Supreme Court: సీజేపీ ఢిల్లీ ఆందోళనలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
-
Noida Airport: నోయిడా ఎయిర్‌పోర్టుకు ‘నరేంద్ర మోడీ’ పేరు.. యోగి కేబినెట్ ఆమోదం
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు