Bihar political crisis: రంగంలోకి సోనియాగాంధీ.. నితీష్‌కు ఫోన్ చేస్తే రిప్లై ఇలా..!?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీహార్‌లో చోటుచేసుకున్న రాజకీయ సంక్షోభంతో ఇండియా కూటమి అలర్ట్ అయ్యింది. కూటమిలో కీలక నేతగా ఉన్న నితీష్‌కుమార్ దాదాపు బయటకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్, ఆప్ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించాయి. తాజాగా జేడీయూ కూడా తెగతెంపులు చేసుకునేందుకు సన్నద్ధమైంది. ఈ అనిశ్చితి ఇలానే కొనసాగితే ఇండియా కూటమికి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లే. మరోవైపు లోక్‌సభ ఎన్నికల ముందు ఇండియా కూటమిలో తలెత్తిన ఈ సంక్షోభం బీజేపీ క్యాష్ చేసుకునే పనిలో పడింది. దీంతో కమలం పార్టీకి ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వకూడదన్న నేపథ్యంలో సోనియాగాంధీ రంగంలోకి దిగారు.
Read Also: Bihar Crisis: అమిషా ఇంట్లో కమలనాథుల కీలక భేటీ.. ఏం చర్చించారంటే..!
Also Read
రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్ర ఈ నెల 30న బిహార్‌లో ప్రవేశించనుంది. ఈ యాత్రలో పాల్గొనవల్సిందిగా ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ను కాంగ్రెస్ ఆహ్వానించింది. ఇదే విషయాన్ని గుర్తుచేసేందుకు నితీష్‌కుమార్‌కు సోనియాగాంధీ ఫోన్ చేశారని సమాచారం. కానీ ఆమెతో మాట్లాడేందుకు ముఖ్యమంత్రి విముఖతను వ్యక్తం చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సోనియా చేసిన ఫోన్‌ను లిఫ్ట్ చేయడానికి నితీష్ అయిష్టతో చూపినట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. ఉద్దేశపూర్వకంగానే సోనియాను నితీష్ పట్టించుకోలేదని తెలిపాయి. రాహుల్ గాంధీ యాత్రలో పాల్గొనడం ఇష్టం లేకనే నితీష్ ఈ పని చేసినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో బీహార్ సంకీర్ణ ప్రభుత్వం కూలిపోవడం ఖాయమన్న ఊహాగానాలకు బలం చేకూరింది. వాస్తవానికి ఇండియా కూటమి ఏర్పాటుకు నితీష్‌కుమార్ కీలక పాత్ర పోషించారు. కానీ కూటమి అధ్యక్షుడిగా తనను కాకుండా మల్లిఖార్జున ఖర్గేను ఎంచుకోవడంపై నితీష్ అలకబూనినట్లు తెలుస్తోంది. మొత్తానికి మరికొద్ది రోజుల్లో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల ముందు ఈ పరిణామాలు ఎటువైపు దారితీస్తాయో వేచిచూడాలి.
తాజావార్తలు
-
RK Roja: మంత్రి లోకేష్‌పై రోజా సంచలన ఆరోపణలు..
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
CM Revanth: భవనాలు నిర్మించడం సులభమే.. కానీ, కలలకు పునాదులు వేయాలంటే సంకల్పం ఉండాలి..!
-
Tamil Nadu: “తమిళం నేర్పలేనిది క్రైస్తవ మతం నేర్పింది”.. విజయ్ మంత్రి వ్యాఖ్యల కలకలం..
-
KTR: ‘8+8 = 0’.. కాంగ్రెస్, బీజేపీ ఎంపీలపై సెటైర్లు..!
ట్రెండింగ్
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
-
Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!