మంగళవారం న్యూజిలాండ్‌తో జరిగిన మూడో వన్డేలో భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన సెంచరీతో చెలరేగింది. దీంతో.. వన్డే క్రికెట్ చరిత్రలోనే అత్యధిక సెంచరీలు చేసిన భారత మహిళా క్రికెటర్‌గా రికార్డు సృష్టించింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 122 బంతుల్లో 100 పరుగులు చేసింది. తన ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు ఉన్నాయి. 28 ఏళ్ల మంధాన వన్డే కెరీర్‌లో ఇది ఎనిమిదో సెంచరీ. తన కెరీర్‌లో ఏడు వన్డే సెంచరీలు చేసిన మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్‌ను అధిగమించింది.
Read Also: Maharashtra Polls: ముగిసిన నామినేషన్ల గడువు.. 15 సీట్లపై రెండు కూటమిల్లో గందరగోళం
మిథాలీ రికార్డును మంధాన బద్దలు కొట్టింది:
మాజీ దిగ్గజ బ్యాట్స్‌మెన్ మిథాలీ రాజ్ రికార్డును మంధాన బద్దలు కొట్టింది. భారత్ తరఫున అత్యధిక వన్డే సెంచరీలు సాధించిన మహిళా క్రికెటర్‌గా స్మృతి మంధాన రికార్డు సృష్టించింది. 88 మ్యాచ్‌ల్లో ఈ ఘనత సాధించింది. కాగా.. మిథాలీ 232 వన్డేల్లో 7 సెంచరీలు చేసింది. ఈ జాబితాలో భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ మూడో స్థానంలో ఉంది. 135 వన్డే మ్యాచ్‌ల్లో ఆరు సెంచరీలు సాధించింది.
Read Also: Maharashtra Polls: ముగిసిన నామినేషన్ల గడువు.. 15 సీట్లపై రెండు కూటమిల్లో గందరగోళం
మంధాన రెండు ముఖ్యమైన భాగస్వామ్యాలు చేసింది:
మూడో మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను 6 వికెట్ల తేడాతో ఓడించిన భారత్ 2-1తో వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది. గత రెండు మ్యాచ్‌ల్లో ఫ్లాప్‌గా నిలిచిన మంధాన అద్భుతంగా బ్యాటింగ్ చేసింది. ఆమె రెండు ముఖ్యమైన భాగస్వామ్యాలు నెలకొల్పింది. మంధాన రెండో వికెట్‌కు యాస్తికా భాటియా (35)తో 76 పరుగులు, హర్మన్‌ప్రీత్ (59 నాటౌట్)తో కలిసి 117 పరుగుల భాగస్వామ్యాలు నెలకొల్పింది.
మంధాన ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచింది:
మంధాన తన అద్భుతమైన ఇన్నింగ్స్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును అందుకుంది. మ్యాచ్ అనంతరం ఆమె మాట్లాడుతూ.. సిరీస్ గెలిచినందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపింది. తాను మొదటి రెండు గేమ్‌ల్లో రాణించలేకపోయినప్పటికీ, ఈరోజు సెంచరీ చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు.