మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో భాగంగా డాక్టర్ డివై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత ఓపెనర్లు స్మృతి మంధాన, ప్రతీక రావల్ అదరగొట్టారు. స్మృతి మంధాన (109; 95 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్స్‌లు) సెంచరీ చేసి పెవిలియన్ చేరింది. స్మృతి 88 బంతుల్లో సెంచరీ చేసింది. మరో ఓపెనర్ ప్రతీక 122 బంతుల్లో శతకం చేసి భారత జట్టుకు మంచి స్కోర్ అందిస్తోంది. స్మృతి, ప్రతీక కలిసి 212 పరుగుల భాగస్వామ్యం అందించారు. దాంతో ఓ ప్రపంచ రికార్డును సమం చేశారు.
స్మృతి మంధాన, ప్రతీక రావల్ కలిసి ఈ సంవత్సరం ఐదు సెంచరీ భాగస్వామ్యాలు నమోదు చేశారు. దాంతో ఒకే ఏడాదిలో అత్యధిక శతక భాగస్వామ్యాలు నమోదు చేసిన జోడిగా నిలిచారు. ఆస్ట్రేలియాకు చెందిన బెలిండా క్లార్క్, లిసా కీట్లీ నెలకొల్పిన ఆల్ టైమ్ రికార్డును మన ప్లేయర్స్ సమం చేశారు. 2000 సంవత్సరంలో బెలిండా, లిసాలు ఐదు సెంచరీ భాగస్వామ్యాలు నెలకొల్పారు. దక్షిణాఫ్రికాకు చెందిన టాజ్మిన్ బ్రిట్స్, లారా వోల్వార్డ్ట్ జంట నాలుగు సెంచరీ స్టాండ్‌లను నమోదు చేశారు. 2015లో న్యూజిలాండ్‌కు చెందిన సుజీ బేట్స్, రాచెల్ ప్రీస్ట్ జోడిలు కూడా 4 శతక భాగస్వామ్యాలు నెలకొల్పారు.
Also Read: AUS vs IND: రెండో వన్డేలోనూ భారత్ పరాజయం.. సిరీస్ పాయే!
ఆస్ట్రేలియాకు చెందిన బెలిండా క్లార్క్, లిసా కీట్లీలు 1997, 2000 ప్రపంచకప్‌లలో రెండుసార్లు 150+ భాగస్వామ్యాలను నమోదు చేశారు. ఆస్ట్రేలియన్ ద్వయం రాచెల్ హేన్స్, అలిస్సా హీలీ 2022లో 2 150+ భాగస్వామ్యాలను సాధించారు. భారతదేశానికి చెందిన స్మృతి మంధాన, ప్రతికా రావల్ 2025లో రెండు 150+ భాగస్వామ్యాలతో ఈ ఘనతను సమం చేశారు. స్మృతి, ప్రతికా కలిసి వన్డేలలో నాల్గవ 150+ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు.