భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన ప్రపంచ రికార్డు నెలకొల్పింది. మహిళల వన్డేల్లో ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాటర్‌గా రికార్డుల్లో నిలిచింది. ఐసీసీ మహిళల ప్రపంచకప్ 2025లో భాగంగా గురువారం నవీ ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో నాలుగు సిక్స్‌లు బాదడంతో ప్రపంచ రికార్డు ఆమె ఖాతాలో చేరింది. ఈ క్రమంలో దక్షిణాఫ్రికా బ్యాటర్ లిజెల్లే లీ రికార్డును అధిగమించింది. అత్యధిక సిక్సర్ల రికార్డు: మహిళల వన్డేల్లో ఒక…
మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో భాగంగా డాక్టర్ డివై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత ఓపెనర్లు స్మృతి మంధాన, ప్రతీక రావల్ అదరగొట్టారు. స్మృతి మంధాన (109; 95 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్స్‌లు) సెంచరీ చేసి పెవిలియన్ చేరింది. స్మృతి 88 బంతుల్లో సెంచరీ చేసింది. మరో ఓపెనర్ ప్రతీక 122 బంతుల్లో శతకం చేసి భారత జట్టుకు మంచి స్కోర్ అందిస్తోంది. స్మృతి, ప్రతీక కలిసి 212 పరుగుల…
IND vs AUS: న్యూ చండీగఢ్‌లో జరిగిన భారత్, ఆస్ట్రేలియా మహిళల జట్టు మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత్ 102 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాపై గెలిచి సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ఈ విజయంతో మహిళల క్రికెట్‌లో ఆస్ట్రేలియాపై అత్యధిక పరుగుల తేడాతో భారత్ గెలిచింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. భారత వైస్-కెప్టెన్ స్మృతి మందాన తన అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తూ కేవలం 91…
Smriti Mandhana: భీకర ఫామ్ లో ఉన్న టీం ఇండియా ప్లేయర్ స్మృతి మందాన మరోసారి సెంచరీ సాధించింది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్లో కేవలం 77 పంతుల్లోనే స్మృతి మందాన సెంచరీ చేసి చరిత్ర సృష్టించింది. టీమిండియా తరఫున రెండో అత్యంత వేగమైన సెంచరీని స్మృతి నమోదు చేసింది. మొహలి వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో స్మృతి మందాన సెంచరీ సాధించింది. ఇక్కడ విశేషమేమిటంటే.. టీమిండియా తరఫున అత్యధిక తక్కువ బంతులతో సెంచరీ…
Smriti Mandhana: భారత మహిళల క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధానా మరోసారి చరిత్ర సృష్టించింది. స్మృతి 2019 తర్వాత తొలిసారిగా ICC మహిళల వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో నెంబర్ 1 స్థానం దక్కించుకుంది. తాజాగా ఐసీసీ విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్ లో మంధానాకు 727 రేటింగ్ పాయింట్లు లభించాయి. ఆ తర్వాత స్థానాల్లో ఇంగ్లండ్ కెప్టెన్ నాటాలీ స్కివర్ బ్రంట్ (719), దక్షిణాఫ్రికా కెప్టెన్ లారా వుల్వార్ట్ (719) లు ఉన్నారు.…
Tri Series: శ్రీలంక వేదికగా జరిగిన మహిళల మూడు జట్ల వన్డే ట్రై సిరీస్ ఫైనల్లో భారత మహిళల జట్టు అద్భుత విజయాన్ని నమోదు చేసింది. నేడు కొలంబో (ఆర్‌పిఎస్) స్టేడియంలో శ్రీలంక మహిళల జట్టుతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత్ 97 పరుగుల తేడాతో గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 342 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ స్మృతి మందాన…