Smriti Irani: రాహుల్ పై స్మృతి ఇరాని ఫైర్.. నువ్వేమైన ప్రధాని అభ్యర్థివా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సార్వత్రిక ఎన్నికల వేళ ఎన్డీఏ, ఇండియా కూటమి నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ నేతలు తీవ్రంగా విమర్శించుకుంటున్నారు. తాజాగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై బీజేపీ నాయకురాలు, ఎంపీ అభ్యర్థి స్మృతి ఇరాని ఫైర్ అయ్యారు. ఎన్నికల అంశాలపై ప్రధాని మోడీతో బహిరంగా చర్చకు తాను సిద్ధమని రాహుల్ తరచూ ప్రకటిస్తున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో స్మృతి ఇరాని కౌంటర్ వేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో చర్చించడానికి రాహుల్ గాంధీ ఏమైనా విపక్షాల కూటమికి ప్రధాని అభ్యర్థిగా ఉన్నారా? అని ప్రశ్నించారు. తమ కంచుకోటలా భావించే నియోజకవర్గంలో ఓ సాధారణ బీజేపీ కార్యకర్తపై కూడా పోటీ చేసే ధైర్యం లేని వ్యక్తి ప్రగల్భాలు పలకడం మానుకోవాలని సూచించారు. ఇక ప్రధానితో భేటీ అయి, ఆయనతో డిబేట్ చేసే స్థాయి రాహుల్‌కి ఉందా అంటూ ఎద్దేవా చేశారు.
READ MORE: India-China: చైనాతో ద్వైపాక్షిక వాణిజ్యం పెరుగుదలపై విదేశాంగ మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు
Also Read
- Botsa Satyanarayana Emotional: మరోసారి బొత్స కన్నీళ్లు.. అమర్నాథ్ వ్యాఖ్యలతో కన్నీటి పర్యంతం
- Saudi Arabia Oil: హోర్ముజ్ తర్వాత మరో షాక్.. మూతపడ్డ సౌదీ చమురు పైప్‌లైన్.. భారత్‌కు పెరిగిన కష్టాలు!
- The Paradise: ప్యారడైజ్ సినిమా కోసం ఎన్ని టన్నుల రక్తం వాడారో తెలుసా.?
- India Matches: రేపు భారత్‌కు డబుల్ ధమాకా.. అఫ్గాన్‌తో పురుషుల జట్టు.. శ్రీలంకతో మహిళల టైటిల్ పోరు.!
ఈ చర్చల వల్ల తమ పార్టీ విజన్‌ను ప్రజలు అర్థం చేసుకునేందుకు వీలుంటుందని.. సరైన సమాచారం ప్రజలకు చేరుతుందని రాహుల్ గాంధీ అన్నారు. ఈ చర్చకు తాను కానీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కానీ పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. లోక్‌సభ ఎన్నికలను పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోడీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఓ వేదికపై బహిరంగ చర్చకు రావాలని ద హిందూ మాజీ సంపాదకుడు ఎన్ రామ్, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మదన్ లోకూర్, ఢిల్లీ హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఏపీ షాలు మూడు రోజుల క్రితం నేతలిద్దరికి లేఖలు రాశారు. వాణిజ్యేతర, పార్టీయేతర వేదికపై ఈ చర్చను జరపాలని, ఇలాంటి బహిరంగ చర్చ కారణంగా ప్రజలకు అవగాహన ఏర్పడటమే కాకుండా ఒక ఆరోగ్యకరమైన, శక్తివంతమైన ప్రజాస్వామ్యాన్ని ప్రదర్శించడంలో గొప్ప ఉదాహరణగా నిలుస్తుందని అన్నారు. ఒకసారి ఇరు నేతలు ఆలోచించాలని సూచించారు.
తాజావార్తలు
-
Allu Arjun Fans : బాక్సాఫీస్ వద్దే కాదు సామాజిక సేవలోనూ ‘తగ్గేదే లే’
-
Dhee 10 Raju Arrested: లైంగిక వేధింపులు.. ఢీ రాజు అరెస్ట్!
-
Botsa Satyanarayana Emotional: మరోసారి బొత్స కన్నీళ్లు.. అమర్నాథ్ వ్యాఖ్యలతో కన్నీటి పర్యంతం
-
Debt Trap: అప్పు మీద అప్పు! దాచుకునేది తక్కువ..లోన్లు ఎక్కువ…ఇదే భారతీయుల దుస్థితి!
-
Shah Rukh Khan: సౌత్ దర్శకులే కావాలంటున్న షారుఖ్.. నెక్స్ట్ సినిమాలపై భారీ స్కెచ్!
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!