Shabad Murder Case: షాబాద్ విషాదం.. ఒంటరిగా మిగిలిన మేఘనకు ప్రభుత్వం ఆర్థిక సాయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shabad Murder Case: షాబాద్ ఘోర హత్యాకాండలో తన తల్లి, చెల్లి, నానమ్మను కోల్పోయి ఒంటరిగా మిగిలిపోయిన మానసిక వికలాంగురాలైన బాలిక మేఘనకు ప్రభుత్వం నుంచి ప్రాథమిక సాయం అందింది. బాధితురాలికి ప్రభుత్వం ఎల్లవేళలా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చిన రంగారెడ్డి జిల్లా కలెక్టర్, మేఘనకు రూ. 10 లక్షల ఆర్థిక సాయం చెక్కును స్వయంగా అందజేశారు. ఈ క్రమంలో మేఘన బాబాయ్, చిన్నమ్మ NTVతో మాట్లాడుతూ తమ ఆవేదనను, భయాందోళనలను పంచుకున్నారు. ఆ దారుణ హత్యాకాండ ఇంకా తమను భయపెడుతూనే ఉందని కన్నీరుమున్నీరయ్యారు. గతంలోనే తండ్రిని కోల్పోయిన మేఘన.. ఇప్పుడు ఈ ఘోరంలో తల్లిని, చెల్లిని, నానమ్మను కోల్పోయి పూర్తిగా అనాథగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. కళ్ల ముందే కన్నతల్లిని, నానమ్మను నిందితుడు రాజ్‌కుమార్ క్రూరంగా చంపడాన్ని మేఘన స్వయంగా చూసిందని.. నాటి నుంచి తీవ్ర భయాందోళనల మధ్య కొట్టుమిట్టాడుతోందని తెలిపారు. రాత్రి కాగానే అమ్మ, నానమ్మ, చెల్లి ఎక్కడ? అని అడుగుతోందని, కనీసం తన సొంత పనులు సైతం చేసుకోలేని స్థితిలో ఉన్న ఆ బాలికను సముదాయించడం తమకు శక్యంగా కావడం లేదని కన్నీటిపర్యంతమయ్యారు. నిందితుడు రాజ్‌కుమార్ సూసైడ్ చేసుకున్నప్పటికీ.. తమ కుటుంబ సభ్యులను కోల్పోయిన బాధ ముందు ఆ వార్త తమకు ఎలాంటి సంతోషాన్ని ఇవ్వలేదని స్పష్టం చేశారు.
మేఘన మానసిక వికాసం, భవిష్యత్తు కోసం కలెక్టర్ మూడు ప్రభుత్వ పునరావాస కేంద్రాలను (రిహాబిలిటేషన్ సెంటర్స్) సూచించారని.. వాటిలో సికింద్రాబాద్‌లోని కేంద్రం బాగుండటంతో మేఘనను అక్కడే చేర్పించాలని నిర్ణయించుకున్నట్లు బాబాయ్, చిన్నమ్మ తెలిపారు. ఇంట్లో జరగాల్సిన కొన్ని కార్యక్రమాలు పూర్తి కాగానే ఆమెను తీసుకెళ్లి అక్కడ జాయిన్ చేస్తామన్నారు. అలాగే మేఘనకు జీవితకాలం పాటు అవసరమైన అన్ని సదుపాయాలను ప్రభుత్వమే కల్పిస్తుందని కలెక్టర్ హామీ ఇచ్చారని వెల్లడించారు. ఈ సందర్భంగా స్థానిక పోలీసుల తీరుపై వారు తీవ్ర అసహనం, అనుమానాలు వ్యక్తం చేశారు. గతంలోనే నిందితుడు రాజ్‌కుమార్‌పై పోక్సో (POCSO) చట్టం కింద ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించి, అసలు పట్టించుకోలేదని ఆరోపించారు. ఆ ప్రాంతంలో సరైన పోలీస్ పెట్రోలింగ్ లేకపోవడం వల్లే ఈ అఘాయిత్యం జరిగిందని మండిపడ్డారు. ఈ కేసులో నిందితుడు రాజ్‌కుమార్‌కు పోలీసులు పూర్తిగా సహకరించారనే బలమైన అనుమానం తమకు ఉందని, ఇదొక విచిత్రమైన పరిస్థితి అని పేర్కొన్నారు. ఇప్పటికైనా పోలీసులు బాధితుల వైపు నిలబడి న్యాయం చేయాలని, తమకు రక్షణగా ఉండాలని డిమాండ్ చేశారు.
Also Read
- LPG Cylinder Shortage: హోర్ముజ్ సంక్షోభం.. భారత్‌లో ఎల్పీజీ కొరతపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి..
- 42 గంటల బ్యాటరీ, అల్ట్రా-లైట్ డిజైన్, AI ఫీచర్లతో VIVO Buds Clip ఓపెన్-ఇయర్ ఇయర్‌ఫోన్స్ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..!
- India XI vs World XI: ప్రపంచ దిగ్గజాలంత ఓ వైపు.. టీమిండియా ఒక్కటే మరోవైపు.. ఫ్యాన్స్‌కు కేక పుట్టించే బిగ్ మ్యాచ్!
- Adilabad: ఆదిలాబాద్ రిమ్స్‌లో అర్ధరాత్రి అగ్నిప్రమాదం.. ఇద్దరు నవజాత శిశువులు మృతి
తాజావార్తలు
-
LPG Cylinder Shortage: హోర్ముజ్ సంక్షోభం.. భారత్‌లో ఎల్పీజీ కొరతపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి..
-
42 గంటల బ్యాటరీ, అల్ట్రా-లైట్ డిజైన్, AI ఫీచర్లతో VIVO Buds Clip ఓపెన్-ఇయర్ ఇయర్‌ఫోన్స్ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..!
-
India XI vs World XI: ప్రపంచ దిగ్గజాలంత ఓ వైపు.. టీమిండియా ఒక్కటే మరోవైపు.. ఫ్యాన్స్‌కు కేక పుట్టించే బిగ్ మ్యాచ్!
-
Adilabad: ఆదిలాబాద్ రిమ్స్‌లో అర్ధరాత్రి అగ్నిప్రమాదం.. ఇద్దరు నవజాత శిశువులు మృతి
-
Ayodhya Ram Temple: రామ మందిరంలో 105 సార్లు కానుకలు కొట్టేశారు.. సుప్రీంకోర్టుకు సిట్ సంచలన నివేదిక
ట్రెండింగ్
-
50MP Zeiss కెమెరా, 1.5K 144Hz డిస్ప్లే, 6,510mAh బ్యాటరీతో ఫ్లాగ్షిప్ మొబైల్ VIVO X500 Pro లాంచ్.!
-
200MP Zeiss టెలిఫొటో కెమెరా, 2K 144Hz డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో VIVO X500 Pro Max లాంచ్..!
-
144Hz డిస్ప్లే, IP68+IP69 రేటింగ్, 1TB స్టోరేజ్, 90W ఛార్జింగ్‌తో VIVO X500.. ధర, ఫీచర్లు ఇదిగో.!
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!