Vijayashanthi: రక్షించాల్సిన వారే తప్పు చేస్తే ఎలా?.. షాబాద్ నరమేధంపై గళమెత్తిన ‘రాములమ్మ’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijayashanthi: రంగారెడ్డి జిల్లా షాబాద్ ఘోర హత్యాకాండపై ప్రముఖ నటి, కాంగ్రెస్ నేత విజయశాంతి సోషల్ మీడియా (ఫేస్బుక్) వేదికగా తీవ్రంగా స్పందించారు. ఈ దారుణ ఉదంతంలో ప్రధాన నిందితుడు జైల్లో ఆత్మహత్య చేసుకోవడంతో కేసు ముగిసిపోయిందని పోలీసులు భావించడం సరికాదని ఆమె హితవు పలికారు. గతంలోనే ఒక మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడి పోక్సో (POCSO) కేసులో అరెస్టయిన నిందితుడు రాజ్‌కుమార్.. అంత సులభంగా బెయిల్‌పై బయటకు రావడానికి స్థానిక పోలీసుల తీవ్ర నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. నిందితుడి వద్ద నుంచి లంచం తీసుకుని, కేసును నీరుగార్చి అతని విడుదలకు పోలీసులు సహకరించారనే వార్తలు పత్రికల ద్వారా తెలుసుకుని తెలంగాణలోని మహిళా లోకం తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
రక్షించాల్సిన పోలీసులే చేసిన ఈ ఘోరమైన తప్పు వల్లే.. ఒకే కుటుంబానికి చెందిన అమాయకుల ప్రాణాలు దారుణంగా బలికావడానికి ఆస్కారం ఏర్పడిందనే అభిప్రాయం వ్యక్తమవుతోందని ఆమె పేర్కొన్నారు. పోలీస్ శాఖలో ఉన్న ఇలాంటి లోపాలు, అవినీతి వల్ల తెలంగాణ రాష్ట్రంలో మహిళల రక్షణ, భద్రతపై ప్రజల్లో తీవ్ర అనుమానాలు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించారు. మహిళలకు పెద్దపీట వేస్తామని, వారి భద్రతకు అత్యంత ప్రాధాన్యమిస్తామని చెప్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ షాబాద్ నరమేధాన్ని, దీని వెనుక ఉన్న పోలీస్ వైఫల్యాలను అత్యంత సీరియస్‌గా పరిగణించాలని విజయశాంతి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మహిళల భద్రతతో పాటు శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో ప్రభుత్వం ఏమాత్రం రాజీపడకుండా, బాధ్యులైన అధికారులపై కఠినంగా వ్యవహరించాలని ఒక మహిళా ప్రజాప్రతినిధిగా కోరుకుంటున్నట్లు ఆమె స్పష్టం చేశారు. హర హర మహాదేవ్, జై తెలంగాణ అని రాసి ఉన్న పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Also Read
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!