SMAT 2025:పుణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ సూపర్ లీగ్ గ్రూప్-A మ్యాచ్‌లో ఝార్ఖండ్ జట్టు అద్భుత ప్రదర్శనతో మధ్యప్రదేశ్‌ను కేవలం ఒక్క పరుగు తేడాతో ఓడించింది. మ్యాచ్ చివరి ఓవర్ వరకూ ఉత్కంఠగా సాగగ.. యువ ఫాస్ట్ బౌలర్ సుశాంత్ మిశ్రా కీలక చివరి ఓవర్‌లో అద్భుతంగా బౌలింగ్ చేసి జట్టుకు గుర్తుండిపోయే విజయం అందించాడు. ఈ గెలుపుతో ఝార్ఖండ్ టోర్నీలో వరుసగా 9వ విజయాన్ని నమోదు…
ఫామ్ కోల్పోయిన తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి భారత జట్టుకు దూరమైన విషయం తెలిసిందే. ప్రస్తుతం సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2025లో ఆడుతున్నాడు. ఆంధ్ర తరఫున ఆడుతున్న నితీశ్.. శుక్రవారం డీవై పాటిల్ అకాడమీలో మధ్యప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో బంతితో మెరిశాడు. మధ్యప్రదేశ్ ఇన్నింగ్స్ మూడో ఓవర్ చివరి మూడు బంతుల్లో హర్ష్ గవాలి, హర్‌ప్రీత్ సింగ్, రజత్ పాటీదార్‌ను ఔట్ చేశాడు. హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టిన అతడు ఒక్కసారిగా వార్తల్లో నిలిచాడు. మధ్యప్రదేశ్‌తో…
మధ్యప్రదేశ్ ఫాస్ట్ బౌలర్ అర్షద్ ఖాన్ చరిత్ర సృష్టించాడు. సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీ చరిత్రలోనే అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలను (6/9) నమోదు చేశాడు. సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీ 2025లో భాగంగా జాదవ్‌పూర్ యూనివర్సిటీ గ్రౌండ్‌లో చండీగఢ్‌తో జరిగిన మ్యాచ్‌లో 9 పరుగులు ఇచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. దాంతో గతంలో టి రవితేజ (హైదరాబాద్), అర్జన్ నాగవాసల్లా (గుజరాత్) నెలకొల్పిన రికార్డు (6/13) బ్రేక్ అయింది. సంచలన బౌలింగ్ చేసిన అర్షద్ ఖాన్‌పై ప్రశంసల…