Teachers Dismiss: యాదాద్రి భువనగిరి జిల్లాలో సుదీర్ఘ కాలం పాటు విధులకు గైర్హాజరయ్యే ఉపాధ్యాయులను, విద్యాశాఖ సీరియస్ గా పరిగణించి చర్యలు తీసుకుంది. ఈ నేపథ్యంలో 16 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులను వారి సర్వీస్ ల నుండి తొలగించాలని నిర్ణయించారు. ఈ ఉపాధ్యాయుల్లో 9 మంది మహిళ ఉపాధ్యాయులు కూడా ఉండగా, మొత్తం 16 మంది ఎస్జిటి (స్కూల్ జూనియర్ టీచర్స్) లు సర్వీస్ నుండి తొలగింపుకు గురయ్యారు. ఈ ఉపాధ్యాయులు, సుదీర్ఘ కాలం పాటు విద్యా సంస్థల విధులకు హాజరుకావడం లేదని అధికారులు గుర్తించారు. అలాగే విద్యాశాఖ నుండి పంపిన నోటీసులకు కూడా వారు ఎలాంటి స్పందన ఇవ్వకపోవడంతో డిఈఓ (డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్) వారిని సర్వీస్ నుండి తొలగించే నిర్ణయం తీసుకున్నారు.
Also Read: Alcohol Effect: ఇంత ట్యాలెంటెడ్గా ఉన్నవేంట్రా బాబు.. అక్కడ ఎలా పడుకున్నావు.?
విద్యాశాఖ ఆధికారుల ప్రకటన ప్రకారం, ఉపాధ్యాయుల గైర్హాజరు అనేది విద్యా వ్యవస్థను ముప్పు కు గురిచేసే అంశంగా మారింది. ముఖ్యంగా, విద్యార్థుల చదువు పై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఉపాధ్యాయుల చేసిన పనికి గాను విద్యాశాఖ ఈ చర్యను తీసుకుంది. ఉపాధ్యాయులు సర్వీస్ నుండి తొలగింపుకు గురైన తర్వాత, వారికి సంబంధించి అన్ని విధులు నిలిపి వేయబడుతాయి. విద్యాశాఖ విద్యార్థుల సీరియస్ గా తీసుకుని తగిన చర్యలు తీసుకోవడం అన్నది సమాజంలో ప్రశంసనీయ అమాసంగా మారింది.