Alcohol Drinking Effect: కొంతమంది వ్యక్తులు మద్యం తగిన సమయంలో వారు చేసి పనులు కొన్ని సార్లు చిత్ర విచిత్రంగా ఉంటాయి. ఈ మధ్య కాలంలో వివిధ సందర్భాల్లో మద్యం తాగడం విపరీతంగా పెరిగిపోయింది. మద్యం తాగడం కేవలం ప్రత్యేక సందర్భాలకు పరిమితమై ఉండకుండా.. ఏ సందర్భం అయినా అడ్డగోలుగా తాగడం మాములుగా మారింది. ఇక న్యూ ఇయర్ వేడుకలు అంటూ చాలామంది వారి స్నేహితులతో కలిసి ఇష్టానుసారంగా తాగి ఎంజాయ్ చేస్తుంటారు. మద్యం తాగి వారి పని వారు చేసుకుంటే బాగుంటుంది..కానీ మద్యం తాగిన తర్వాత కొందరు చేసే పనుల వల్ల ఇతరులు ఇబ్బందులు పడుతుంటారు. కొన్ని సార్లు అయితే ఇలా మద్యం మత్తులో కొందరు అనుకోని ఘటనల వల్ల ప్రాణాలు కూడా కోల్పోతుంటారు. అయితే తాజాగా ఓ వ్యక్తి మద్యం మత్తులో కరెంట్ స్తంభం ఎక్కి విన్యాసాలు చేసిన సంఘటన అందరిని షాక్ కు గుర్తు చేస్తోంది. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను చూస్తే..
Also Read: Drunk Man: ఎంత తాగావ్ రా నాయనా..? డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులో ఏకంగా 550 పాయింట్లు అవాక్కయిన పోలీసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మన్నెం జిల్లా పాలకొండ మండలం సింగిపురంలో ఓ తాగుబోతు హడలెత్తించాడు. మద్యం మత్తులో ఆ వ్యక్తి కరెంటు స్తంభం పైకి ఎక్కి హల్చల్ చేశాడు. అయితే మద్యం తాగిన వ్యక్తి కరెంటు స్తంభం ఎక్కిన సమయంలో ఆ ప్రాంతంలో ఉన్న పలువురు వెంటనే సంబంధిత పవర్ ట్రాన్స్ఫార్మర్ ను ఆపేశారు. ఆ తర్వాత మద్యం తాగిన వ్యక్తి ఆగకుండా పైకి వెళ్లి ఏకంగా విద్యుత్ గల పైన పడుకున్నాడు. విద్యుత్ తీగలపైనే కొద్దిసేపు విన్యాసాలు చేశారు. గ్రామ ప్రజలు అందరూ కలిసి బలవంతంగా అతనిని కిందికి తీసుకురావడంతో పెను ప్రమాదం తప్పింది. మద్యం తాగిన వ్యక్తి స్తంభం ఎక్కుతున్న సమయంలోనే అక్కడివారు త్వరగా స్పందించి సరైన సమయానికి విద్యుత్ సరఫరాను నిలిపివేయడంతో ప్రాణాలతో మిగిలాడు. ఇక సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. వీడియో చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. అసలు అలా ఎందుకు విద్యుత్ స్తంభం ఎక్కాలనిపించింది అంటూ కొందరు కామెంట్ చేస్తుండగా.., మరికొందరేమో మద్యం తాగితే మరి ఇంత ఓవరాక్షన్ చేయాల్సిన అవసరం లేదంటూ మండిపడుతున్నారు.