ఎన్డీఏ కూటమి వేట నిషేధ సమయంలో మత్స్య కారుల సాయాన్ని పది వేల నుంచి 20 వేలకు పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుందంటూ మత్స్యకారులకు శుభవార్త చెప్పారు మంత్రి నిమ్మల.. ఈ నెల 26వ తేదీన మత్స్యకారులకు రూ.20 వేల చొప్పు సాయాన్ని సీఎం చంద్రబాబు నాయుడు అందిస్తారని తెలిపారు..
Marine Fishing Ban: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయంతో సముద్ర జలాల్లో సోమవారం అర్ధరాత్రి నుంచి చేపల వేట నిషేధం అమల్లోకి వచ్చింది. జూన్ 14వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకు ఈ నిషేధాంక్షలు అమల్లో ఉంటాయని మత్స్యశాఖ ప్రకటించింది.
ఏపీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. విశాఖలో సముద్రంలో ఆరుగురు మత్స్యకారులు గల్లంతయ్యారు. నిన్న సాయంత్రం విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ నుంచి మత్స్యకారులు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లారు. వైజాగ్ హార్బర్ నుంచి V1-MO -2736 నెంబర్ గల బోట్ లో వేటకు వెళ్లినట్లు తెలుస్తోంది. హార్బర్ నుంచి దక్షిణ దిశగా గంగవరం వైపు వేటకు వెళ్లారు మత్య్సకారులు. అయితే వారి ఆచూకీ తెలియకపోవడంతో ఫిషింగ్ బోట్లు, కోస్ట్ గార్డ్ సాయంతో గాలింపు చర్యలు చేపడుతున్నారు.
ఓఎన్జీసీ పైపులైన్ ద్వారా జీవనోపాధి కోల్పోయిన మత్స్యకారులకు వర్చువల్‌గా డబ్బు విడుదల చేశారు.. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో సొమ్ము జమ చేశారు.
సముద్రంలో చేపలు పట్టటానికి వెళ్లిన మత్స్యకారులకు విష్ణుమూర్తి దర్శమిచ్చాడు. శంఖు, చక్రాలతో నారాయణుడి విగ్రహం మత్స్యకారులకు దొరికింది. పుదుచ్చేరిలో చేపల కోసం వల వేసిన మత్స్యకారులకు శంఖు, చక్రాలు ధరించిన శ్రీమన్నారాయణుడి ప్రతిభ లభ్యమైంది. ఆ విగ్రహాన్ని చూసిన వాళ్లు తన్మయత్వం చెంది భక్తితో రెండు చేతులు జోడించి నమస్కరించారు.