భారత మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ రెండో పెళ్లికి సిద్ధమవుతున్నాడు. తన ప్రేయసి సోఫీ షైన్‌ను వివాహం చేసుకోనున్నట్లు సమాచారం. ఓ ధావన్-సోఫీ వివాహ వేడుక ఫిబ్రవరి మూడో వారంలో ఢిల్లీ–ఎన్‌సీఆర్ ప్రాంతంలో అంగరంగ వైభవంగా జరగనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వివాహ ఏర్పాట్లు మొదలైనట్టు సమాచారం. ఈ వివాహ వేడుకకు పలువురు క్రికెట్ ప్రముఖులు, గబ్బర్ సన్నిహితులు హాజరయ్యే అవకాశం ఉంది. శిఖర్ ధావన్, సోఫీ షైన్ పరిచయం కొన్నేళ్ల క్రితమే ప్రారంభమైంది. వీరిద్దరూ దుబాయ్‌లో మొదటిసారి…
శిఖర్ ధావన్.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుత బ్యాటింగ్‌తో అభిమానులను అలరించిన గబ్బర్.. మైదానంలో తన చిలిపి చేష్టలతో నవ్వులు పూయించేవాడు. ఇక కరోనా మహమ్మారి సమయంలో మాజీ సతీమణి, కుమారుడితో రీల్స్ చేసి అందరినీ కడుపుబ్బా నవ్వించాడు. ఇటీవల కాస్త సైలెంట్ అయిన ధావన్.. మళ్లీ మొదలెట్టాడు. తాజాగా ఓ సరదా వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. ఇది కాస్త సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. శిఖర్ ధావన్…