Sheena Chohan: “అమర్-ప్రేమ్” కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న షీనా చోహన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sheena Chohan: షీనా చోహన్ తన నూతన చిత్రం “అమర్-ప్రేమ్” పూర్తి చేసి విజయవంతంగా 2023 ఏడాదికి గుడ్ బై చెప్పనున్నారు. ట్రయాంగిల్ ప్రేమకథా చిత్రంగా తెరకెక్కించిన “అమర్-ప్రేమ్” వచ్చే ఏడాది ప్రపంచ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయడానికి సిద్ధంగా ఉంది. జాతీయ అవార్డు, ఫిలింఫేర్ అవార్డు అందుకున్న సువేందు రాజ్ ఘోష్ తెరకెక్కించిన ఈ చిత్రం ప్రతిష్టాత్మక జాతీయ, అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలలో ప్రదర్శించబడుతుంది. ఆ తరువాత థియేటర్లలో విడుదలకానుంది. ఈ చిత్రంలోని పాత్ర తన హృదయానికి దగ్గరైందని నటి షీనా చోహన్ వెల్లడించారు. జాతీయ అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలలో ప్రదర్శనలు త్వరలో ప్రారంభమవుతాయన్నారు. ఆ తర్వాత థియేట్రికల్ విడుదల కానుందని.. ఇది ఒక భావోద్వేగ ప్రయాణమని చెప్పుకొచ్చారు.
Read Also: Charan NTR: వార్ 2 vs ధూమ్ 4… బాలీవుడ్ కూడా మన హీరోల మధ్యే వార్
Also Read
- AP Alliance Seat Sharing: టీడీపీ, జనసేన, బీజేపీ పోటీ చేసే స్థానాలపై క్లారిటీ.. అధికారిక ప్రకటన ఎప్పుడంటే?
- Instant Noodle: ఇన్స్టంట్ నూడుల్స్ తినడంలో భారత్ రికార్డు..! చైనా, జపాన్, వియత్నాం స్థానాలివే..
- Bhindi Health Benefits: బెండకాయ జిగురును చూసి దూరం పెడుతున్నారా? ప్రయోజనాలు తెలిస్తే షాకే..!
- Telangana Bar Licences Draw : లక్కీ డ్రాలో లక్ ఎవరికో?.. రాష్ట్రంలో బార్ల కేటాయింపునకు సర్వం సిద్ధం..
షీనా చోహన్ త్వరలో టాలీవుడ్లోకి అడుగుపెట్టబోతోంది. జాతీయ అవార్డు గ్రహీత దర్శకుడు జయరాజ్ దర్శకత్వం వహించిన మమ్ముట్టి “ది ట్రైన్” అనే మలయాళ చిత్రం ద్వారా ఆమె తెరపైకి వచ్చారు. నెట్‌ఫ్లిక్స్‌లో “యాంట్ స్టోరీ”తో పెద్ద విజయాన్ని అందుకున్నారు. మోస్తోఫా సర్వర్ ఫరూకీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం దుబాయ్, షాంఘై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శించబడింది. ఉత్తమ నటిగా నామినేషన్ పొందింది. షీనా త్వరలో టారన్ లెక్స్టన్ హాలీవుడ్ చిత్రం ‘నో మాడ్’తో అందరినీ పలకరించబోతోన్నారు. ఒక నటిగా షీనా మంచి కథలను ఎంచుకుంటూ తన ప్రతిభను చాటుకుంటున్నారు. ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్‌లోనూ షీనా అభిమానుల్ని సంపాదించుకున్నారు. తన సినిమాలతో, తన పాత్రలతో అందరి మనసుల్లో చెరగని ముద్ర వేస్తున్నారు. ఢిల్లీ థియేటర్ ఆర్ట్స్‌లో ఆమె ఎన్నో అద్భుతమైన ప్రదర్శనలు ఇచ్చారు. జాతీయ అవార్డులు గెలుచుకున్న దర్శకుడు బుద్ధదేబ్ దాస్‌గుప్తా చేసిన ప్రాజెక్టులోని ఆమె నటనకు గానూ “ఇట్ గర్ల్” అనే బిరుదు వచ్చింది.
Read Also: Salaar : ఆ థియేటర్ లో 28 ఏళ్ల షారుఖ్ మూవీ సెంటిమెంట్ ను బ్రేక్ చేసిన సలార్..
ఓటీటీలో మాధురీ దీక్షిత్, కాజోల్ వంటి ప్రముఖులతో కలిసి షీనా చోహన్ తనదైన ముద్ర వేశారు. బప్పాదిత్య బంధోపాధ్యాయ దర్శకత్వం వహించిన ఇండిపెండెంట్ ఫీచర్ ఫిల్మ్ “జస్టిస్” రాబోయే సంవత్సరంలో అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలలో ప్రదర్శితం కానుంది. “ఎక్స్ మేట్స్”లో ఆమె నటనకు గానూ అవార్డులు గెలుచుకున్నారు. ఆదిత్య ఓం దర్శకత్వం వహించిన బయోపిక్ స్టార్ సుబోధ్ భావే సరసన ఆవలి కథానాయికగా హిందీ బయోపిక్ ఫీచర్ ఫిల్మ్ ‘సంత్ తుకారాం’ షూటింగ్ కూడా పూర్తి చేసింది. 2024లో షీనా నటించిన నాలుగు డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్ విడుదలకు సిద్దంగా ఉన్నాయి.
తాజావార్తలు
-
iQOO Pad Pro 8.8: iQOO Pad Pro 8.8 త్వరలో లాంచ్.. 9,020mAh బ్యాటరీ, 165Hz డిస్ప్లేతో అదిరిపోయే ఫీచర్లు!
-
CM Revanth Reddy : ఎండల సెగ.. నీటి కష్టాలు.? రైతులకు సీఎం అలర్ట్
-
Consumer Court: రూ.2 కోసం కక్కుర్తి పడితే రూ.1.06 లక్షల వాత!
-
CM Revanth Reddy : ఎల్ నినో ముప్పుపై అప్రమత్తంగా ఉండాలి.. సీఎం రేవంత్ రెడ్డి పిలుపు
-
AP Alliance Seat Sharing: టీడీపీ, జనసేన, బీజేపీ పోటీ చేసే స్థానాలపై క్లారిటీ.. అధికారిక ప్రకటన ఎప్పుడంటే?
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!