iQOO Pad Pro 8.8: iQOO Pad Pro 8.8 త్వరలో లాంచ్.. 9,020mAh బ్యాటరీ, 165Hz డిస్ప్లేతో అదిరిపోయే ఫీచర్లు!
- 9,020mAh బ్యాటరీతో iQOO కొత్త ట్యాబ్లెట్
- 165Hz OLED స్క్రీన్, కూలింగ్ ఫ్యాన్ ప్రత్యేకతలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
iQOO Pad Pro 8.8 Launch Soon: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivoకు చెందిన సబ్‌బ్రాండ్ iQOO మరో కొత్త ట్యాబ్లెట్‌ను మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమవుతోంది. iQOO Pad Pro 8.8 పేరుతో రానున్న ఈ ట్యాబ్లెట్‌కు సంబంధించిన కీలక ఫీచర్లు, బ్యాటరీ సామర్థ్యాన్ని కంపెనీ వెల్లడించినట్లు సమాచారం. ముఖ్యంగా గేమింగ్‌ను లక్ష్యంగా చేసుకుని ఇందులో శక్తివంతమైన ప్రాసెసర్, అధిక రిఫ్రెష్ రేట్ డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్ వంటి ఫీచర్లను అందించనున్నట్లు తెలుస్తోంది. ఈ ట్యాబ్లెట్‌ను తొలుత చైనా మార్కెట్లో విడుదల చేయనున్నారు. దీనితో పాటు iQOO Neo 12 స్మార్ట్‌ఫోన్‌ను కూడా పరిచయం చేసే అవకాశం ఉందని సమాచారం. అయితే ట్యాబ్లెట్ ధర, పూర్తి స్పెసిఫికేషన్లను కంపెనీ ఇంకా వెల్లడించాల్సి ఉంది.
Weiboలో చేసిన పోస్ట్ ద్వారా iQOO Pad Pro 8.8ను ఈ నెలలో చైనాలో విడుదల చేయనున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఈ ట్యాబ్లెట్ కోసం ప్రీ-ఆర్డర్లు కూడా ప్రారంభమైనట్లు సమాచారం. అయితే భారత మార్కెట్లో ఈ ట్యాబ్లెట్ ఎప్పుడు విడుదలవుతుంది? భారత్‌లో ధర ఎంత ఉంటుంది? అనే వివరాలపై ఇంకా స్పష్టత లేదు. చైనా లాంచ్ తర్వాతే భారత మార్కెట్‌కు సంబంధించిన సమాచారం వెల్లడయ్యే అవకాశం ఉంది.
Also Read
- iPhone Duo Repair Cost: రూ.3 లక్షల iPhone Duo.. స్క్రీన్ రిపేర్‌కే రూ.1.49 లక్షలు! రిపేర్ ధరల పూర్తి జాబితా ఇదే
- Red Magic 12 Pro+: 8400mAh బ్యాటరీతో Red Magic 12 Pro+ రిలీజ్.. 185Hz డిస్ప్లే, 100W ఛార్జింగ్‌తో అదుర్స్!
- WhatsApp Guest Calling Feature: WhatsApp కొత్త ఫీచర్.. అకౌంట్ లేకుండానే వీడియో కాల్స్‌లో చేరొచ్చు.. ఎలా వాడాలంటే?
- Samsung Galaxy F70 5G: సామ్ సంగ్ Galaxy F70 5G భారత్ లో రిలీజ్ డేట్ ఫిక్స్.. 50MP కెమెరా, 120Hz డిస్ప్లే!
iQOO Pad Pro 8.8లో 8.8 అంగుళాల OLED డిస్ప్లేను అందించనున్నట్లు సమాచారం. దీనికి 165Hz రిఫ్రెష్ రేట్ ఉండటం ప్రత్యేకత. ఈ ట్యాబ్లెట్లో 9,020mAh సామర్థ్యం కలిగిన బ్యాటరీని అందించనున్నట్లు కంపెనీ వెల్లడించింది. పెద్ద బ్యాటరీ ఉండటం వల్ల గేమింగ్, వీడియో స్ట్రీమింగ్ వంటి పనులకు ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ లభించే అవకాశం ఉంది. గేమింగ్ సమయంలో ట్యాబ్లెట్ వేడెక్కకుండా ఉండేందుకు ఇందులో యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో కూడిన Ice Dome Quad-Cooling Systemను అందించనున్నట్లు సమాచారం. iQOO Pad Pro 8.8లో Snapdragon 8 Elite Gen 5 చిప్సెట్ ఉండవచ్చని టెక్ వర్గాలు భావిస్తున్నాయి.
తాజావార్తలు
-
iQOO Pad Pro 8.8: iQOO Pad Pro 8.8 త్వరలో లాంచ్.. 9,020mAh బ్యాటరీ, 165Hz డిస్ప్లేతో అదిరిపోయే ఫీచర్లు!
-
CM Revanth Reddy : ఎండల సెగ.. నీటి కష్టాలు.? రైతులకు సీఎం అలర్ట్
-
Consumer Court: రూ.2 కోసం కక్కుర్తి పడితే రూ.1.06 లక్షల వాత!
-
CM Revanth Reddy : ఎల్ నినో ముప్పుపై అప్రమత్తంగా ఉండాలి.. సీఎం రేవంత్ రెడ్డి పిలుపు
-
AP Alliance Seat Sharing: టీడీపీ, జనసేన, బీజేపీ పోటీ చేసే స్థానాలపై క్లారిటీ.. అధికారిక ప్రకటన ఎప్పుడంటే?
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!