Salaar : ఆ థియేటర్ లో 28 ఏళ్ల షారుఖ్ మూవీ సెంటిమెంట్ ను బ్రేక్ చేసిన సలార్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన సలార్ మూవీ బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టిస్తోంది. సలార్ సినిమాకు 9 రోజుల్లో సుమారుగా 500 కోట్లకుపైగా వసూళ్లు వచ్చినట్లు తెలుస్తోంది.సలార్ కంటే ఒక రోజు ముందు విడుదలైన బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ డంకీ మూవీ కలెక్షన్స్ మాత్రం దారుణంగా పడిపోతున్నాయి.ఇదిలా ఉంటే బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ కు ప్రపంచ వ్యాప్తంగా బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇండియాలో అయితే షారుక్ ఖాన్‌కు ఫుల్ క్రేజ్ ఉంది. ఆయన సినిమా వచ్చిందంటే ఫ్యాన్స్ కు ఆరోజు పండగనే చెప్పాలి..రీసెంట్ గా షారుక్ పఠాన్, జవాన్ వంటి సినిమాలతో భారీ హిట్స్ అందుకున్నారు.ఇదిలా ఉంటే షారుక్ ఖాన్ సినీ కెరీర్‌లో దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే మూవీ ఎంతో స్పెషల్.షారుక్ ఖాన్ , కాజోల్ జంటగా నటించిన దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే మూవీని ముంబైలోని మరాఠా మందిర్ థియేటర్‌లో ఇప్పటికీ ప్రదర్శిస్తున్నారు.
1995 లో విడుదల అయిన ఈ మూవీని సుమారుగా 28 సంవత్సరాలుగా మరాఠా మందిర్‌లో రోజుకు ఓ షో వేస్తున్నారు. మిగిలిన సమయంలో ఆ టైమ్‌లో విడుదలయ్యే సూపర్ హిట్ మూవీస్ మరియు కొత్త రిలీజ్ సినిమాలు ప్రదర్శిస్తుంటారు. ఒకవేళ షారుక్ మూవీ వస్తే అన్ని షోలు ఆయన సినిమాలే ఆడతాయి.అయితే షారుక్ ఖాన్ రీసెంట్ గా నటించిన డంకీ సినిమా రిలీజ్‌కు ముందు మరాఠా మందిర్ థియేటర్‌లో యానిమల్ మూవీని ప్రదర్శించారు. తర్వాత యానిమల్ తీసేసి డంకీ సినిమాను షోస్‌గా వేశారు. కానీ, సలార్ విడుదలయ్యాక మాత్రం షారుక్ డంకీని కూడా తీసేసి ప్రభాస్ మూవీని ప్రదర్శించారు. ఎప్పుడూ అధికంగా షారుక్ సినిమాలు ఆడే ఆ థియేటర్‌లో డంకీని ఒక్కరోజు మాత్రమే ప్రదర్శించారు.ఇప్పుడు ఈ విషయం హాట్ టాపిక్‌గా మారింది. దాదాపుగా షారుక్ టెరిటరీగా చెప్పుకునే మరాఠా మందిర్‌లో డంకీ పక్కన పెట్టి ప్రభాస్ సలార్ మూవీ ప్రదర్శించి థియేటర్ యాజమాన్యం 28 ఏళ్ల సెంటిమెంట్‌ను బ్రేక్ చేశారు.
Also Read
- Tags
- Dunki
- prabhas
- salaar
- Sharukh Khan
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!