Telangana Bar Licences Draw : లక్కీ డ్రాలో లక్ ఎవరికో?.. రాష్ట్రంలో బార్ల కేటాయింపునకు సర్వం సిద్ధం..
- తెలంగాణలో 41 బార్ల లైసెన్సుల కోసం భారీ పోటీ
- 14 బార్లకు 4,251 దరఖాస్తులు
- మిగిలిన 27 బార్లకు 4,519 అప్లికేషన్లు
- శుక్రవారం ఉదయం 11 గంటలకు లక్కీ డ్రా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో నూతన బార్ల లైసెన్సుల కేటాయింపు ప్రక్రియ తుది దశకు చేరుకుంది. అత్యంత ఉత్కంఠగా ఎదురుచూస్తున్న లక్కీ డ్రా నిర్వహణకు ఎక్సైజ్ శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్ట్రవ్యాప్తంగా రికార్డు స్థాయిలో వచ్చిన దరఖాస్తులతో ఎక్సైజ్ అధికారులతో పాటు వ్యాపార వర్గాల్లోనూ తీవ్ర ఆసక్తి నెలకొంది. శుక్రవారం ఉదయం 11 గంటలకు దరఖాస్తుదారుల సమక్షంలో పారదర్శకంగా ఈ లక్కీ డ్రా నిర్వహించనున్నారు.
తెలంగాణ క్యూర్ అర్బన్ రీజియన్ (TCUR) పరిధిలోని 14 బార్ల కోసం ఏకంగా 4,251 దరఖాస్తులు రాగా, మిగిలిన కార్పొరేషన్లు , మున్సిపాలిటీల్లోని 27 బార్లకు 4,519 దరఖాస్తులు దాఖలయ్యాయి. కేవలం 41 బార్ల కోసం మొత్తంగా వేల సంఖ్యలో అప్లికేషన్లు రావడంతో, లక్కీ డ్రాలో అదృష్టం ఎవరిని వరిస్తుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
Also Read
టీసీయుఆర్ పరిధిలోని 14 బార్లకు సంబంధించిన లక్కీ డ్రాను ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ సి. హరికిరణ్ తీయనున్నారు. ఈ ప్రక్రియను సైబరాబాద్, గ్రేటర్ హైదరాబాద్, మల్కాజిగిరి డిప్యూటీ కమిషనర్లు పర్యవేక్షించనున్నారు. టీసీయుఆర్ పరిధిలోని దరఖాస్తుదారుల కోసం గండిపేట మండలం నార్సింగ్‌లోని ‘ది అడ్రస్ కన్వెన్షన్ అండ్ ఎగ్జిబిషన్’ వేదికగా లక్కీ డ్రాను నిర్వహిస్తున్నట్లు సైబరాబాద్ డిప్యూటీ కమిషనర్ జె. హరికిషన్ తెలిపారు. ఇక మిగిలిన జిల్లాల్లో ఆయా జిల్లా కలెక్టర్ల చేతుల మీదుగా లక్కీ డ్రా తీసి బార్ లైసెన్సీలను ఎంపిక చేయనున్నారు.
లక్కీ డ్రాలో పాల్గొనే దరఖాస్తుదారులందరికీ ఇప్పటికే వాట్సాప్ , ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం చేరవేశామని అధికారులు తెలిపారు. దరఖాస్తుదారులు శుక్రవారం ఉదయం 9 గంటలకల్లా నిర్దేశిత వేదికలకు చేరుకోవాలని డిప్యూటీ కమిషనర్లు కోరారు. భారీ పోటీ మధ్య జరిగే ఈ లక్కీ డ్రాలో ఎవరి అదృష్టం పండుతుందో, ఏ కొత్త వ్యాపారులకు బార్ల లైసెన్సులు దక్కుతాయో కొద్ది గంటల్లో తేలనుంది.
తాజావార్తలు
-
Telangana Bar Licences Draw : లక్కీ డ్రాలో లక్ ఎవరికో?.. రాష్ట్రంలో బార్ల కేటాయింపునకు సర్వం సిద్ధం..
-
PM Modi: ఆసియా క్రీడల పతక విజేతలతో ప్రధాని మోడీ భేటీ.. భారత క్రీడాకారుల విజయాలపై ప్రశంసలు!
-
Isha Ambani: జియో పుట్టుక వెనుక అసలు కథ.. ఈషా అంబానీ చెప్పిన సీక్రెట్ స్టోరీ!
-
EPFO ECR Filing Deadline: వేతన పరిమితి మార్పులతో ECR ఫైలింగ్‌లో మార్పులు.. EPFO కీలక నిర్ణయం
-
Nepal: చైనాను కాదని, భారత్‌కే ఓటేసిన నేపాల్ ప్రధాని..
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!