Consumer Court: రూ.2 కోసం కక్కుర్తి పడితే రూ.1.06 లక్షల వాత!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Consumer Court: వాటర్ బాటిల్ మీద ఎంఆర్పీ కంటే రెండు రూపాయలు ఎక్కువ అడిగితే ఏముందిలే అని చాలామంది లైట్ తీసుకుంటారు. కానీ ఆ రెండు రూపాయల అదనపు వసూలే ఓ ప్రముఖ రెస్టారెంట్ మెడకు పెద్ద ఉచ్చులా బిగుసుకుంది. పైగా ప్రశ్నించిన కస్టమర్‌పై నిర్లక్ష్యంగా ప్రవర్తించి సమాధానం చెప్పినందుకు వినియోగదారుల కమిషన్ ఆ రెస్టారెంట్ యాజమాన్యానికి కళ్లు బైర్లు కమ్మే షాక్ ఇచ్చింది. రెండు రూపాయల కోసం ఏకంగా రూ.1.06 లక్షల జరిమానా చెల్లించాల్సి వచ్చింది. అసలు ఏం జరిగిందంటే.. ఉత్తరప్రదేశ్‌లోని హథ్రాస్‌లో ఉన్న ప్రసిద్ధ ‘బీబీసీఎన్ రెస్టారెంట్’కి ఓ కస్టమర్ వెళ్లారు. అక్కడ భోజనం చేసిన తర్వాత బిల్లు చూస్తే షాక్ తగిలింది. వాటర్ బాటిల్ అసలు ఎమ్మార్పీ రూ.18 ఉంటే, రెస్టారెంట్ వాళ్లు రూ.20 వసూలు చేయడమే కాకుండా దానిపై అదనంగా జీఎస్టీ కూడా యాడ్ చేశారు. దీంతో ఆ కస్టమర్ వెంటనే బిల్లుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆ ఎక్స్ట్రా మొత్తాన్ని వెనక్కి ఇవ్వాలని కోరారు. అయితే రెస్టారెంట్ నిర్వాహకులు డబ్బులు వెనక్కి ఇవ్వకపోగా ఎదురు దాడికి దిగారు. “ఇదేదైనా పెద్ద హోటల్ అయితే ఇదే వాటర్ బాటిల్‌కు రూ.50 వసూలు చేసేవాళ్లు.. మేం రూ.20 తీసుకుంటే తప్పేంటి?” అంటూ దబాయించారు. రెస్టారెంట్ సిబ్బంది ప్రవర్తనతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆ కస్టమర్, లీగల్ నోటీసు పంపించినా యాజమాన్యం నుంచి స్పందన లేకపోవడంతో అలీగఢ్ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌ను ఆశ్రయించారు.
వినియోగదారుల కమిషన్‌లో న్యాయవాదులు అంకుర్ అగర్వాల్, అమిత్ తోమర్ బాధితుడి తరఫున వాదనలు వినిపించారు. కమిషన్ ఈ వ్యవహారంలో రెస్టారెంట్‌కు పలుమార్లు నోటీసులు పంపించినప్పటికీ, వారి తరఫున ఏ ఒక్కరూ విచారణకు హాజరు కాలేదు. కమిషన్ ఆదేశాలను ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో తీవ్ర అసహనం వ్యక్తం చేసిన ఫోరం, ఏకపక్షంగా సంచలన తీర్పును వెలువరించింది. వినియోగదారుల హక్కులను కాలరాసినందుకు గాను రూ.1 లక్షను జిల్లా వినియోగదారుల సంక్షేమ నిధి (కన్స్యూమర్ వెల్ఫేర్ ఫండ్)లో జమ చేయాలని రెస్టారెంట్‌ను ఆదేశించింది. దీనికితోడు కస్టమర్‌కు మానసిక వేదన కలిగించినందుకు రూ.1,000 నష్టపరిహారం, న్యాయవాది ఖర్చుల కింద మరో రూ.5,000 కలిపి మొత్తం రూ.1.06 లక్షలు చెల్లించాలని స్పష్టం చేసింది. కేవలం రెండు రూపాయల కోసం అడ్డగోలుగా మాట్లాడిన రెస్టారెంట్‌కు ఈ తీర్పు జీవితాంతం గుర్తుండిపోయే గుణపాఠంగా మారింది. ఎంఆర్పీ కంటే ఒక్క రూపాయి ఎక్కువ తీసుకున్నా వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేసి తగిన బుద్ధి చెప్పవచ్చని ఈ ఘటన మరోసారి నిరూపించింది.
Also Read
- Special Summary Revision: SIR వివాదం మధ్య ఈసీ కీలక నిర్ణయం.. 17 రాష్ట్రాల్లో ఓటరు జాబితాల సవరణకు ఆదేశాలు!
- Jio Recharge: యూజర్లకు జియో షాక్.. రీఛార్జ్ ధరల పెరిగే ఛాన్స్..!
- PM Modi: ఆసియా క్రీడల పతక విజేతలతో ప్రధాని మోడీ భేటీ.. భారత క్రీడాకారుల విజయాలపై ప్రశంసలు!
- EPFO ECR Filing Deadline: వేతన పరిమితి మార్పులతో ECR ఫైలింగ్‌లో మార్పులు.. EPFO కీలక నిర్ణయం
తాజావార్తలు
-
Consumer Court: రూ.2 కోసం కక్కుర్తి పడితే రూ.1.06 లక్షల వాత!
-
CM Revanth Reddy : ఎల్ నినో ముప్పుపై అప్రమత్తంగా ఉండాలి.. సీఎం రేవంత్ రెడ్డి పిలుపు
-
AP Alliance Seat Sharing: టీడీపీ, జనసేన, బీజేపీ పోటీ చేసే స్థానాలపై క్లారిటీ.. అధికారిక ప్రకటన ఎప్పుడంటే?
-
Kawasaki Z300 India Launch: Kawasaki Z300 భారత్‌లోకి.. ధర ఎంత? 296cc ఇంజిన్, ఫీచర్లు, లాంచ్ డేట్ వివరాలు!
-
Nithiin: ‘అలియాస్ రుక్మిణి’తోనైనా నితిన్ లెక్క సరిచేస్తాడా?
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!