Charan NTR: వార్ 2 vs ధూమ్ 4… బాలీవుడ్ కూడా మన హీరోల మధ్యే వార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పటికే నార్త్ ఇండియాలో జెండా పాతి ఖాన్స్ కి కూడా అందని రికార్డ్స్ ని క్రియేట్ చేస్తున్నాడు. షారుఖ్ లాంటి సూపర్ స్టార్ హీరోతో క్లాష్ ఉన్నా కూడా ప్రభాస్ నార్త్ బెల్ట్ లో వంద కోట్లని రాబడుతున్నాడు అంటే ప్రభాస్ మార్కెట్ హిందీలో ఏ రేంజులో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇప్పుడు చరణ్, ఎన్టీఆర్ కూడా నార్త్ లో సోలో సాలిడ్ మార్కెట్ కోసం రెడీ అవుతున్నారు. ఆర్ ఆర్ ఆర్ సినిమాతో హిందీ బెల్ట్ లో స్టార్స్ గా ఎంట్రీ ఇచ్చారు ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్. జక్కన్న ఇచ్చిన ఎంట్రీ పాస్ తో బాలీవుడ్ లో సత్తా చాటాలి, మార్కెట్ సొంతం చేసుకోవాలి అంటే మాత్రం ఎన్టీఆర్ అండ్ చరణ్ సొంతగా కష్టపడాలి, నార్త్ ఆడియన్స్ కి నచ్చే సినిమాలు చేయాలి. ఇప్పుడు ఈ పని చేయడానికే ఎన్టీఆర్-ఎన్టీఆర్ రెడీ అవుతున్నారని సమాచారం. ఎన్టీఆర్ ఇప్పటికే హ్రితిక్ రోషన్ తో వార్ 2 సినిమాలో నటిస్తున్నాడు. అనౌన్స్మెంట్ తోనే బజ్ జనరేట్ చేసిన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా స్టార్ట్ అయిపొయింది. దేవర షూటింగ్ కంప్లీట్ అయిపోతే ఎన్టీఆర్ వార్ 2 షూటింగ్ లో జాయిన్ అయిపోతాడు. ఇప్పుడు చరణ్ కూడా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.
ఇండియన్ సినిమాలో ఫ్రాంచైజ్ లు పెద్దగా ప్రేక్షకులని అలరించవు అనే మాటని పూర్తిగా చెరిపేస్తూ ఇండియన్ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ రేంజులో పేరు తెచ్చుకుంది ‘ధూమ్ సిరీస్’. ఇప్పటికే మూడు పార్ట్స్ వచ్చిన ఈ ఫ్రాంచైజ్ నుంచి లేటెస్ట్ గా ధూమ్ 4 సినిమాని అనౌన్స్ చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. చాలా రోజులుగా ఈ విషయంపై బాలీవుడ్ లో వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి కానీ ధూమ్ 4 అఫీషియల్ అనౌన్స్మెంట్ మాత్రం రాలేదు. లేటెస్ట్ గా అందుతున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం… ధూమ్ 4 సినిమాలో షారుఖ్ ఖాన్‌తో పాటు రామ్ చరణ్ కూడా నటించనున్నాడని ప్రచారం జరుగుతోంది. అయితే చరణ్ ఇప్పుడు గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్నాడు, ఇది అవ్వగానే బుచ్చిబాబుతో RC16 స్టార్ట్ చేయనున్నాడు. ఈ రెండు సినిమాలు అయ్యే వరకూ చరణ్ ఇంకో సినిమా సైన్ చేస్తాడా లేదా అనేది ఆలోచించాల్సిన విషయమే. ఒకవేళ నిజంగానే చరణ్ ధూమ్ 4లో అడుగు పెడితే మాత్రం రచ్చ మాములుగా ఉండదు. ఇప్పటికే దేవర, గేమ్ ఛేంజర్ సినిమాలు పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తూ 2024లో రిలీజ్ అవ్వడానికి రెడీ అవుతున్నాయి. ఇవి కూడా నార్త్ లో సూపర్ హిట్స్ గా నిలిస్తే… అటు వార్ 2 తో ఎన్టీఆర్, ఇటు ధూమ్ 4తో రామ్ చరణ్ తేజ్ బాలీవుడ్ లోనే బాలీవుడ్ హీరోలతోనే పోటీ పడడం గ్యారెంటీ. మరి ఈ ఇద్దరి దండయాత్రని బాలీవుడ్ ఎలా తట్టుకుంటుందో చూడాలి.
Also Read
- Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
- Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
- Vijay Deverakonda: "బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!".. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
- Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!