Site icon NTV Telugu

Shashi Tharoor: మొదట ప్రధానిపై ప్రశంసలు.. ఇప్పుడు బీజేపీ ఎంపీతో సెల్ఫీ

Shasi Tharoor

Shasi Tharoor

కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. తాజాగా.. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు బైజయంత్ జై పాండాతో కలిసి దిగిన సెల్ఫీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంతకుముందు ప్రధాని మోదీని ప్రశంసించిన వ్యాఖ్యలు, ఈ ఫోటో శశి థరూర్ రాజకీయ భవిష్యత్తును మరింత ఉత్కంఠకరంగా మార్చాయి. ఢిల్లీలో ఇటీవల జరిగిన చర్చ సందర్భంగా శశి థరూర్ రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, భారతదేశం యొక్క దౌత్యంపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై భారత్ వైఖరిని మొదట్లో తాను విమర్శించానని, అయితే మూడేళ్ల తర్వాత భారత్ వైఖరి చెల్లుబాటు అయిందని అన్నారు. భారత వైఖరిని విమర్శించి తాను ఒక మూర్ఖుడిలా మిగిలానని అన్నారు. ఈ వ్యాఖ్యలు బీజేపీ శ్రేణుల నుంచి ప్రశంసలు అందుకుంటున్నాయి. అయితే.. కాంగ్రెస్ ఈ వ్యాఖ్యలను వ్యక్తిగత వ్యాఖ్యగా పేర్కొంది.

Read Also: UP: యూపీలో ఘోరం.. పెళ్లికి పిలవలేదని వరుడి తండ్రిపై పొరుగింటి వ్యక్తి కాల్పులు

మరోవైపు.. శశి థరూర్ ఇటీవల కాంగ్రెస్ పార్టీలో నాయకత్వ లోపం గురించి కూడా ఆందోళన వ్యక్తం చేశారు. “కాంగ్రెస్‌లో నాయకత్వం లేకపోవడం చాలా పెద్ద సమస్యగా మారింది. ఈ పరిస్థితిలో, పాకిస్తాన్‌తో పోరాటం చేయడం, కేరళలో మూడోసారి ప్రతిపక్షంలో కూర్చోవడం తప్పదు” అని అన్నారు. శశి థరూర్ తన వ్యక్తిగత రాజకీయ భవిష్యత్తుపై క్లారిటీ ఇచ్చారు. “నా దగ్గర అనేక ఆప్షన్లు ఉన్నాయి. పార్టీ నన్ను ఉపయోగించుకోవాలనుకుంటే, నేను కాంగ్రెస్‌లోనే ఉంటాను. కానీ నాకు అనేక ఎంపికలు ఉన్నాయి,” అని ఆయన స్పష్టం చేశారు.

Read Also: Purple Cap in IPL: ఐపీఎల్‌లో తొలిసారి పర్పుల్ క్యాప్ అందుకున్నది ఎవరో తెలుసా..? ఫుల్ లిస్ట్ ఇదే

తనకు కేరళలో మంచి గుర్తింపు ఉందని, స్వతంత్ర సర్వేలు కూడా తనను ముందున్న నాయకుడిగా చూపిస్తున్నాయని శశి థరూర్ పేర్కొన్నారు. “కేరళలో నేను ఇతర నాయకుల కంటే ముందున్నానని సర్వేలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో, పార్టీలో నాయకత్వ మార్పులు ఉంటే, నేను దానికి ఒక ముఖ్యమైన భాగం అయ్యే అవకాశం ఉందని నేను భావిస్తున్నాను,” అని ఆయన చెప్పారు. శశి థరూర్ ఈ వ్యాఖ్యలు, చర్చలు, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడితో సెల్ఫీ దిగడం వంటి సంఘటనలు రాజకీయ వర్గాల్లో తీవ్రమైన చర్చలకు దారి తీస్తున్నాయి.

Exit mobile version