కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. తాజాగా.. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు బైజయంత్ జై పాండాతో కలిసి దిగిన సెల్ఫీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంతకుముందు ప్రధాని మోదీని ప్రశంసించిన వ్యాఖ్యలు, ఈ ఫోటో శశి థరూర్ రాజకీయ భవిష్యత్తును మరింత ఉత్కంఠకరంగా మార్చాయి.