ఓట్లు అన్నీ నీకు వేస్తే.. నీళ్ళు రాయలసీమకు ఇచ్చారు కేసీఆర్ అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. తెలంగాణ జాతిపిత అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు కదా.. తెలంగాణలో ఆయనకట్టు ఎందుకు తగ్గించారని ప్రశ్నించారు. నల్గొండకు కోతలు... రంగారెడ్డి కి నీళ్ళు ఇవ్వలేదన్నారు.. గోదావరి నీళ్లు రాయలసీమ తీసుకుపోతే తప్పులేదు అన్నారని చెప్పారు. పొద్దున్న క్లబ్.. రాత్రి ఐతే పబ్బుల్లో చర్చ చేయాలని చూస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు..
Merugu Nagarjuna : ఏపీలో చదువులమ్మ తల్లిని చంద్రబాబు అటకెక్కిస్తున్నారని వైసీపీ మాజీ మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చదువుకు జగన్ అధిక ప్రాధాన్యత ఇచ్చారని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా… అమ్మ ఒడి ద్వారా ప్రతీ తల్లి ఖాతాలో 15 వేల రూపాయలు జమచేశారని, ఏపీలో గొప్ప సంస్కరణలకు జగన్ ఆధ్యుడని ఆయన తెలిపారు. చంద్రబాబు అమ్మ ఒడి పథకాన్ని తల్లికి వందనంగా పేరుమార్చారని, ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే అంతమందికీ 15…
వక్ఫ్ సవరణ బిల్లును ఈరోజు లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లును ఆమోదించడానికి ఎన్డీఏ సిద్ధం కాగా.. ఇండియా బ్లాక్ మాత్రం దీనికి వ్యతిరేకంగా ఉంది. లోక్ సభలో వక్ఫ్ సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా డీఎంకే ఎంపీ ఎ. రాజా భారతీయ జనతా పార్టీపై విమర్శలు గుప్పించారు. ఒక్క ముస్లిం ఎంపీ కూడా లేని పార్టీ మైనారిటీల హక్కులను కాపాడేందుకు ఈ బిల్లును తీసుకురావడం విడ్డూరంగా ఉందని ఆయన అన్నారు. ఈ బిల్లును ప్రవేశపెట్టగల లేదా దాని…
CM Revanth Reddy : తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్‌ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లుగా మాటలయుద్ధం నడుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మీరు కట్టిన ప్రాజెక్టులు కూలిపోయినా నీళ్లు ఇవ్వడానికి ఉందని బీఆర్‌ఎస్ నేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం నుంచి నీరు తీసుకోకపోయినా పంటలు పండించాం అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రజలను తప్పుదారి పట్టించకండని, లగచర్లలో జరిగిందంటున్నారు.. మరి ఆనాడు మల్లన్నసాగర్‌లో జరిగింది ఏంటి అని సీఎం రేవంత్ ప్రశ్నించారు. కొండపోచమ్మ…
KTR : చివరి రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. అసెంబ్లీ సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ కేటీఆర్ అన్నట్లు మాటల యుద్ధం నడుస్తోంది. గత ప్రభుత్వం తనపై కక్ష కట్టి ఎన్నో రకాలుగా ఇబ్బందులకు గురిచేసిందని సీఎం రేవంత్ రెడ్డి ఉగ్రరూపం చూపించారు. అనంతరం కేటీఆర్ అసెంబ్లీలో మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డికి ఫ్రస్టేషన్ ఎందుకో అర్థంకావడంలేదు అని ఆయన అన్నారు. ఆయన సీఎం సీటులో కూర్చుంటా అన్నాడు.. కూర్చున్నా కూడా కూల్ కావడం…
సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో డీ లిమిటేషన్‌పై తీర్మానం ప్రవేశపెట్టారు. అనంతరం ఆయన ప్రసంగించారు. పునర్విభజన పారదర్శనకంగా జరగాలన్నారు. "జనాభా నియంత్రణ శాపం కాకూడదు. జనాభా వాటా తగ్గిన రాష్ట్రాలు నష్టపోకూడదు. జనాభా ఒక్కటే ప్రామాణికం కాకూడదు. రాష్ట్రాన్ని యూనిట్ గా తీసుకుని నియోజక వర్గ పునర్విభజన చేయాలి. వాజ్ పేయి కూడా పునర్విభన 25 ఏళ్లు వాయిదా వేశారు. జనాభా ప్రాతిపదికన నియోజక వర్గాల పునర్విభజన చేయాలని ఆలోచన సరికాదు. కేంద్రమే నిర్ణయం తీసుకోలేదు అని కేంద్ర…
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. తాజాగా.. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు బైజయంత్ జై పాండాతో కలిసి దిగిన సెల్ఫీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంతకుముందు ప్రధాని మోదీని ప్రశంసించిన వ్యాఖ్యలు, ఈ ఫోటో శశి థరూర్ రాజకీయ భవిష్యత్తును మరింత ఉత్కంఠకరంగా మార్చాయి.
రాజ్యసభలో చర్చ సందర్భంగా టీఎంసీ ఎంపీ సాకేత్ గోఖలే కేంద్ర దర్యాప్తు సంస్థల గురించి ప్రశ్నలు లేవనెత్తారు. హోం మంత్రిత్వ శాఖను ఇరుకున పెట్టడానికి ప్రయత్నించారు. దీనిపై హోంమంత్రి అమిత్ షా స్పందించిన సర్ది చెప్పడానికి ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో అమిత్ షా సంచలన విషయాన్ని వెల్లడించారు. సీబీఐ, ఎంపీ సాకేత్ చెబుతున్న కేంద్ర దర్యాప్తు సంస్థలు హోం మంత్రిత్వ శాఖ పరిధిలోకి రావని ఆయన అన్నారు. కాబట్టి, ప్రశ్నలు లేవనెత్తే ముందు, వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవాలని…
తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కే స్టాలిన్‌పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. గత రెండు నెలలుగా తమిళనాడు ముఖ్యమంత్రి వితండ వాదం చేస్తున్నాడని ఆరోపించారు. దక్షిణ భారతదేశంలో మాకు అన్యాయం చేయడానికి మోదీ కుట్ర పన్నాడు అని మాట్లాడుతున్నారు.. అది పూర్తిగా రాజకీయపరమైన విమర్శ అని పేర్కొన్నారు.
ఒక భాషను బలవంతంగా రుద్దడం లేదా ఒక భాషను గుడ్డిగా వ్యతిరేకించడం.. రెండూ మన భారతదేశం యొక్క జాతీయ, సాంస్కృతిక ఏకీకరణ లక్ష్యాన్ని సాధించడంలో సహాయపడవని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. నిన్న జనసేన సభలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు తమిళనాడులో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై పలువురు స్పందించారు. తాజాగా పవన్ వారికి ఎక్స్ వేదికగా సమాధానం చెప్పారు.