Sonia Gandhi: కేరళలోని మున్నార్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి. మున్నార్‌లో సోనియా గాంధీ అనే మహిళ బీజేపీ టికెట్‌పై పోటీ చేస్తోంది. 34 ఏళ్ల సోనియా గాంధీ మున్నార్ పంచాయతీలోని 16వ వార్డు నల్లతన్ని నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆసక్తికరంగా ఆమె తండ్రి బలమైన కాంగ్రెస్ మద్దతుదారుడు.. మాజీ కాంగ్రెస్ అధ్యక్షురాలైన సోనియా గాంధీ ప్రేరణతో తన కుమార్తెకు ఆ పేరు పెట్టారు. ఈ విషయం బీజేపీ అభ్యర్థి సోనియా గాంధీ స్వయంగా…
Rajeev Chandrasekhar: కేరళ బీజేపీ అధ్యక్షుడు , మాజీ కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. కోజికోడ్‌లో కేంద్ర మంత్రివర్గంలో ముస్లింలకు ప్రాతినిధ్యం లేదని చెప్పిన తర్వాత రాజకీయ దుమారం చెలరేగింది. మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Pinarayi Vijayan: 71వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ‘‘ది కేరళ స్టోరీ’’ సినిమాకు రెండు ప్రధాన అవార్డులు వచ్చాయి. ఈ అవార్డులు ప్రకటించని కొన్ని గంటల్లోనే కేరళ సీఎం పినరయి విజయన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సినిమాకు అవార్డులు ఇచ్చి కేరళ రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీశారని ఆరోపించారు. ఇలాంటి చిత్రాన్ని సత్కరించడం ద్వారా కేంద్రం తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తోందని సీఎం అన్నారు.
Congress: కేరళ రాష్ట్రంలోని యూడీఎఫ్ నేతల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా తన వైపే మొగ్గు చూపుతున్నారనే సర్వే బయటకు వచ్చిందంటూ లోక్‌సభ ఎంపీ శశిథరూర్ చేసిన పోస్టుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఆయన వ్యాఖ్యలకు కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.. మొదట ఆయన ఏ పార్టీలో కొనసాగుతున్నారో చెప్పాలని డిమాండ్ చేసింది.
మాజీ కేంద్ర మంత్రి, టెక్నోక్రాట్ నుండి రాజకీయ నాయకుడిగా మారిన రాజీవ్ చంద్రశేఖర్ సోమవారం కేరళ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కేరళలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడమే తన లక్ష్యమని తెలిపారు.
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. తాజాగా.. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు బైజయంత్ జై పాండాతో కలిసి దిగిన సెల్ఫీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంతకుముందు ప్రధాని మోదీని ప్రశంసించిన వ్యాఖ్యలు, ఈ ఫోటో శశి థరూర్ రాజకీయ భవిష్యత్తును మరింత ఉత్కంఠకరంగా మార్చాయి.
కేరళ సీఎం పినరయి విజయన్-గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ మధ్య నెలకొన్న వైరం మరింత ముదురుతోంది. శనివారం రోడ్డుపై వెళ్తుండగా ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు అడ్డుకోవడంతో ఆరిఫ్ మహ్మద్ ఖాన్ మరింత అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. వెంటనే కారులో నుంచి కిందికి దిగి గవర్నర్ నిరసన వ్యక్తం చేశారు. తక్షణమే ఎస్ఎఫ్ఐ కార్యకర్తలను అరెస్ట్ చేయాలని గవర్నర్ డిమాండ్ చేశారు. ఈ వ్యవహారం రాజకీయంగా పెద్ద దుమారమే చెలరేగింది.
మాజీ ప్రధాని దేవెగౌడ చేసిన ప్రకటనపై కేరళలో రాజకీయ వివాదం నెలకొంది. కర్ణాటకలో బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు కేరళలో అధికార ఎల్డీఎఫ్ మిత్రపక్షమైన జేడీఎస్‌కు ఆమోదం తెలిపినట్లు జేడీఎస్ అధినేత హెచ్డీ దేవెగౌడ చేసిన వాదనను కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ శుక్రవారం (అక్టోబర్ 20) తోసిపుచ్చారు.