శర్వానంద్ హీరోగా బైక్ రేసింగ్ నేపథ్యంలో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన చిత్రం బైకర్ మలయాళ కుట్టీ మాళవిక నాయర్ ఈ సినిమాలో శర్వాతో హీరోయిన్ గా జోడీ కడుతోంది. టాలీవుడ్ సీనియర్ హీరో రాజశేఖర్ ఈ చిత్రంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. మా నాన్న సూపర్ హీరో ఫేం అభిలాస్ కంకర ఈ సినిమాకు దర్శకుడు. యువి క్రియేషన్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోంది. డిసెంబర్ 6న థియేటర్లలోకి రాబోతోంది బైకర్. డిసెంబర్ 5న రిలీజ్ కాబోతున్న బాలయ్య అఖండ2తో పోటీ పడుతున్నాడు శర్వానంద్.
రిలీజ్ కు కొద్దీ సమయం ఉండడంతో ప్రమోషన్స్ లో భాగంగా కాలేజీలు పర్యటిస్తూ బైకర్ ను ప్రమోట్ చేస్తున్నాడు శర్వా. కానీ ఉన్నట్టుండి ఈ సినిమా ప్రమోషన్స్ కు బ్రేక్ ఇచ్చారు మేకర్స్. కారణాలు ఏంటని ఆరాతీయగా ఇంట్రెస్టింగ్ న్యూస్ తెలిసింది. డిసెంబరు 6న రావాల్సిన బైకర్ వాయిదా పడింది. ఈ సినిమాకు సంబందించిన సీజీ వర్క్స్ ఇంకా ఫినిష్ కాలేదట. ఎలా చూసుకున్న రిలీజ్ నాటికి కంటెంట్ అందదు, ఎదో చుట్టేసి రిలీజ్ చేసే బదులు ఓ వారం వెనక్కి వెళదామని భావించారు మేకర్స్. దానికి తోడు అఖండ 2 ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ రావడం పాన్ ఇండియా భాషలలో రిలీజ్ కాబోతుండడం, ఇన్ సైడ్ టాక్ కూడా గొప్పగా ఉండడంతో బాలయ్యతో పోటీ ఎందుకని కూడా ఓ వారం వెనక్కి వెళ్ళాడు శర్వా. సోలో రిలీజ్ తో వస్తే కాస్త మంచి ఓపెనింగ్ ఉంటుంది, టాక్ బాగుంది మంచి వసూళ్లు రాబట్టొచ్చు. బైకర్ వాయిదా వేసి సోలో రిలీజ్ కు వెళ్లడం గుడ్ సైన్.