NCP: అజిత్ పవార్ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు.. ముగ్గురిని తొలగించిన ఎన్సీపీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sharad Pawar’s NCP Removes 3 Leaders: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ ఆదివారం మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా అజిత్ పవార్ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైనందుకు ముగ్గురు పార్టీ నేతలను తొలగించారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ తిరుగుబాటుదారుడు అజిత్ పవార్‌కు మద్దతు ఇచ్చిన వారిని తొలగించినట్లు తెలుస్తోంది. బహిష్కరణకు గురైన నాయకులు ముంబై డివిజనల్ ఎన్సీపీ చీఫ్ నరేంద్ర రాథోడ్, అకోలా సిటీ జిల్లా చీఫ్ విజయ్ దేశ్‌ముఖ్, రాష్ట్ర మంత్రి శివాజీరావు గార్జే. ముగ్గురూ అజిత్ పవార్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు.
Also Read: Sharad Pawar: సమయం వచ్చినప్పుడు అందరూ నాతో ఉంటారు.. ఎన్సీపీ అధినేత కీలక వ్యాఖ్యలు
Also Read
- Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
- INDIA Bloc: రాహుల్ నిరసనకు అఖిలేష్ దూరం.. కాంగ్రెస్-SP మధ్య గ్యాప్?
- Maharashtra: మహా ఘోరం.. పెట్రోల్ బంక్ సీజ్ చేయడానికి వెళ్లిన అధికారి హత్య
- PM Modi: ‘‘మోడీని దించేందుకు ప్రయత్నిస్తున్నారు’’.. సెర్బియా మాజీ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
అధికారంలో ఉన్న శివసేన-బీజేపీ కూటమితో పొత్తు పెట్టుకునేందుకు అజిత్ పవార్ తిరుగుబాటుకు మద్దతు ఇచ్చిన 9 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ఎన్సీపీ క్రమశిక్షణ కమిటీ పిలుపునిచ్చింది. “9 మంది ఎమ్మెల్యేల ఈ చర్యలు తక్షణం అనర్హత వేటు వేయాలి. ఒకవేళ సభ్యులుగా కొనసాగడానికి అనుమతిస్తే, వారు పార్టీ ప్రయోజనాలను దెబ్బతీసే ప్రయత్నం కొనసాగించే అవకాశం ఉంది” అని ఎన్సీపీ క్రమశిక్షణ కమిటీ ఒక ప్రకటనలో పేర్కొంది. అజిత్ పవార్ అనూహ్యం తిరుగుబాటు చేసిన ఎన్సీపీ అధినేత, బాబాయ్ శరద్ పవార్‌కు షాక్ ఇచ్చారు.
Also Read: Jharkhand: మంత్రి మరణించిన 2 నెలల తర్వాత మంత్రిగా భార్య ప్రమాణ స్వీకారం
ఆదివారం రాజ్‌భవన్‌లో గవర్నర్ రమేష్ బైస్, అజిత్ పవార్ చేత ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. రాష్ట్రంలోని బీజేపీ-శివసేన ప్రభుత్వంలో ఎనిమిది మంది ఎన్సీపీ నేతలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. 2024లో బీజేపీ వ్యతిరేక ఫ్రంట్‌లో కీలక పాత్ర పోషించాలని భావిస్తున్న 83 ఏళ్ల మరాఠా నాయకుడు శరద్ పవార్ ధైర్యంగా అజిత్ పవార్ తిరుగుబాటును “దోపిడీ”గా పేర్కొన్నాడు. బీజేపీతో అధికారాన్ని పంచుకోవాలన్న తన నిర్ణయాన్ని అజిత్ పవార్ సమర్థించుకున్నారు. శివసేనతో కలిసి వెళ్లగలిగితే బీజేపీతో కూడా వెళ్లగలమని, నాగాలాండ్‌లో కూడా అదే జరిగింది అని అజిత్ పవార్ అన్నారు. కాంగ్రెస్‌ను విడిచిపెట్టిన తర్వాత 1999లో తన బాబాయ్ స్థాపించిన ఎన్సీపీలో ఎటువంటి చీలిక లేదని ఆయన నొక్కి చెప్పారు.
తాజావార్తలు
-
TGSRTC : దసరా జర్నీకి టీజీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్.. 7 వేల స్పెషల్ బస్సులు
-
Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
-
Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
-
INDIA Bloc: రాహుల్ నిరసనకు అఖిలేష్ దూరం.. కాంగ్రెస్-SP మధ్య గ్యాప్?
-
పండుగ పూట EMIల మోత.. హోమ్ లోన్ తీసుకున్నవారిపై భారం ఎంతంటే!
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!