భారత్, పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ అంటే.. హోరాహోరీ పోరు, ఆటగాళ్లలో కసి, అభిమానుల్లో ఎంతో ఆసక్తి, పతాక స్థాయిలో భావోద్వేగాలు ఉంటాయి. కానీ ఆసియా కప్ 2025లో భాగంగా ఆదివారం రాత్రి దుబాయ్ వేదికగా జరిగిన భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌లో ఇవేమీ కనిపించలేదు. దుబాయ్ స్టేడియంలో పాక్ అభిమానుల సందడి కాసేపు కనిపించినా.. ఆ తర్వాత అది కూడా కనిపించకుండా పోయింది. పాకిస్థాన్ పేలవ ప్రదర్శన కారణంగా ఫాన్స్ నిరాశలో కనిపించారు. భారత్ చేతిలో ఓటమి అనంతరం…
ఆసియా కప్ 2025లో భాగంగా ఆదివారం దుబాయ్ వేదికగా భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో దాయాది పాకిస్థాన్ ఘోర ఓటమిని ఎదుర్కొంది. ముందుగా బ్యాటింగ్‌లో 127 పరుగులే చేసిన పాక్.. ఆపై బౌలింగ్‌లో కూడా దారుణంగా విఫలమైంది. ముఖ్యంగా స్టార్ పేసర్ షాహీన్ షా అఫ్రిది ఘోర వైఫల్యం ఆ జట్టుపై ప్రభావం చూపింది. ప్రపంచంలో బెస్ట్ ఫాస్ట్ బౌలర్లలో ఒకడైన అఫ్రిది.. 16 ఓవర్లలో రెండు ఓవర్లే బౌలింగ్ చేయడం విశేషం. ఆ రెండు ఓవర్లలో ఏకంగా…
2025 ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ జట్టు ఒక్క మ్యాచ్ కూడా గెలువలేదు. పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. ఈ క్రమంలో.. స్వదేశంలో నిర్వహిస్తున్న ఈ టోర్నీలో విజయం సాధించనందుకు ఆ దేశ అభిమానులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.