Delhi Ordinance Bill: ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందగా.. నేడు రాజ్యసభలో చర్చకు వచ్చింది. రాజ్యసభలో కాంగ్రెస్‌తోపాటు ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఎంపీలు బిల్లును వ్యతిరేకించారు. ఢిల్లీకి రాష్ట్ర హోదా ఇచ్చే విషయంలో మాజీ ప్రధాని జవహార్‌లాల్ నెహ్రూ చెప్పినట్టుగా కాకుండా .. బీజేపీ నేత మాజీ ప్రధాని వాజ్‌పేయి చెప్పినట్టుగా ఆలోచించాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా చర్చ సందర్భంగా సూచించారు. మనమంతా కలిసికట్టుగా ఈ బిల్లును వ్యతిరేకించాలి. ఎందుకంటే ఈ తరహా ఫెడరలిజం ఏదోఒక రోజు మీ ఇంటి తలుపు కూడా తట్టొచ్చు’ అని కాంగ్రెస్ నేత అభిషేక్ సింఘ్వి బిల్లుకు మద్దతు ఇస్తున్న పార్టీలను హెచ్చరించారు. ఈ సందర్భంగా జర్మన్ థియోలాజియన్ మార్టిన్ నీమొల్లర్ చెప్పిన విషయాన్ని ప్రస్తావించారు. ‘క్లిష్టసమయంలో మనం ఎవరి తరఫున నిల్చోకుండా తప్పించుకుంటే.. మనకు అలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు మన తరఫున నిల్చొని మాట్లాడటానికి ఎవరూ ఉండరు’ అని అన్నారు.
Read also: Meera Jasmine: ‘చిగురాకు చాటు చిలక’లా మీరా జాస్మిన్.. లేటెస్ట్ ఫొటోలు చూశారా?
రాజ్యసభలో ఢిల్లీ సర్వీసెస్ బిల్లుపై చర్చ సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన రాఘవ్ చద్దా కేంద్రంపై విమర్శలు చేశారు. ఢిల్లీకి పూర్తి స్థాయి రాష్ట్ర స్థాయి హోదాను కోరుకునే తమ సొంత నాయకులైన అటల్ బిహారీ వాజ్‌పేయి మరియు ఎల్‌కె అద్వానీలను అనుసరించాలని అమిత్ షాకు సూచించారు. ఢిల్లీలో వరుసగా పలు ఎన్నికల్లో ఓటమి పాలైన నేపథ్యంలో బీజేపీ ఈ రకంగా స్పందిస్తోందని ఆరోపించారు. ఈ ఆర్డినెన్స్ ను తీసుకువస్తూ ఫెడరలిజాన్ని ఉల్లంఘిస్తున్నారని, మరియు రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదించే అడ్డంకిని దాటకుండా రాజ్యాంగాన్ని మారుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఢిల్లీ ప్రభుత్వం నుండి బ్యూరోక్రాట్‌ల నియంత్రణను చేజిక్కించుకున్న ఆర్డినెన్స్‌ను భర్తీ చేసే ఢిల్లీ గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ (సవరణ) బిల్లు- 2023 ఇప్పటికే లోక్‌సభలో ఆమోదం పొందగా.. . దీనిని చర్చ మరియు ఓటింగ్ కోసం ఈరోజు ఎగువ సభ(రాజ్యసభ)లో చర్చకు పెట్టారు.
Read also: Kakani Govardhan Reddy: పోలీసులకు వర్క్ ఫ్రం హోం అంట.. ఇది సాధ్యమయ్యేదేనా?
ప్రధానిగా వాజ్‌పేయి, డిప్యూటీ పీఎంగా అద్వానీ ఢిల్లీకి రాష్ట్ర హోదా కల్పించేందుకు అప్పుడు బిల్లు తీసుకొచ్చారని గుర్తు చేసిన చద్దా.. ఢిల్లీకి రాష్ట్ర హోదా ఇవ్వాలని బీజేపీ జాతీయ కార్యవర్గం నిర్ణయించింది. ఢిల్లీని రాష్ట్రంగా చేస్తామని బీజేపీ ప్రజలకు వాగ్దానం చేసిందని చద్దా అన్నారు. ‘నెహ్రూవాదీ కావద్దు, అద్వానీవాదీ అవ్వండి’ అని అమిత్ షాకు చెప్పాలనుకుంటున్నాని రాఘవ్ చద్దా తెలిపారు. “సుప్రీం కోర్ట్ ఆదేశాలకు వ్యతిరేకంగా మీరు వెళ్లాల్సిన సంక్షోభం ఏమిటి? ఇది దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని అవమానించడమే. సుప్రీం కోర్టు ఏమి చెప్పినా పట్టించుకోవడం లేదని బీజేపీ సందేశం ఇచ్చిందని… సుప్రీంకోర్టును సవాలు చేశారని ఆప్ ఎంపీ విమర్శించారు.