ప్రముఖ నటుడు మంచు మోహన్‌బాబు కుటుంబ వ్యవహారం రచ్చకెక్కింది. గుర్తుతెలియని వారు తనపై దాడి చేశారని.. తనకు, తన భార్య మౌనికకు ప్రాణహాని ఉందంటూ మంచుమనోజ్ పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇది జరిగిన కొద్ది నిమిషాల్లోనే ఆయన తండ్రి మోహన్‌బాబు రాచకొండ సీపీ సుధీర్‌బాబుకు లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. మౌనిక, మనోజ్ వల్ల తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదులో మోహన్ బాబు పేర్కొన్నారు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తోన్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని విద్యాసంస్థలకు మరో మూడు రోజుల పాటు సెలవులు పొడిగించింది. కాగా.. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే.. గత సోమవారం నుంచి నేటి వరకు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే.. అయితే, వర్షాలు తగ్గుముఖం పట్టకపోవడంతో, మరో మూడు రోజుల పాటు సెలవులను పొడిగించారు. బుధవారాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. read also: Thank You…
కరోనా మహమ్మారి కారణంగా విద్యాసంస్థలు అన్నీ మూతపడ్డాయి.. కేవలం ఆన్‌లైన్ విద్యకే పరిమితం అయ్యారు.. అయితే, తిరిగి సెప్టెంబర్ 1వ తేదీ నుంచి విద్యాసంస్థలను ప్రారంభించేందుకు సిద్ధమైంది ప్రభుత్వం.. కేజీ నుంచి పీజీ వరకు ప్రత్యక్ష బోధన జరుగుతుందనే ఇప్పటికే సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.. ఇక, విద్యాసంస్థల ప్రారంభానికి ఇదే సరైన సమయం అన్నారు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. హైదరాబాద్‌లోని మహబూబియా బాలికల పాఠశాలను ఇంటర్ బోర్డు కార్యదర్శి ఒమర్ జలీల్, పాఠశాల విద్యా…
కరోనా మహమ్మారి విజృంభణతో మూతపడిన స్కూళ్లు, విద్యాసంస్థలు మళ్లీ తెరుచుకోన్నాయి.. అంగన్ వాడీలతో సహా రాష్ట్రంలోని అన్ని రకాల ప్రైవేట్, ప్రభుత్వ విద్యా సంస్థలను సెప్టెంబర్ 1వ తేదీ నుంచి పునర్ ప్రారంభించాలని ఇవాళ సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్ణయించింది. గ్రామాలు, పట్టణాల్లోని అన్ని విద్యాసంస్థలు, వసతి గృహాలను శుభ్రపరిచి ఆగస్టు 30లోగా సానిటైజేషన్ చేయాలని పంచాయితీ రాజ్, మున్సిపల్ శాఖల మంత్రులు, అధికారులను ఆదేశించారు సీఎం…
సెప్టెంబర్ 1వ తేదీ నుంచి అన్ని విద్యాసంస్థలు ప్రారంభించాలని నిర్ణయించింది తెలంగాణ ప్రభుత్వం… విద్యా సంస్థలు తెరవచ్చని నివేదిక ఇచ్చింది వైద్య ఆరోగ్యశాఖ.. దీంతో.. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ప్రత్యక్ష క్లాసులు ప్రారంభించేందుకు తెలంగాణ సర్కార్ అనుమతి ఇచ్చింది.. 1వ తేదీ నుంచి అన్ని రకాల విద్యాసంస్థలు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు సీఎం కేసీఆర్… విద్యాశాఖ మంత్ర సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో.. ఇవాళ విద్యాశాఖ అధికారులు కూడా నివేదిక ఇచ్చారు. దీనిని…
కోవిడ్ మహమ్మారి కారణంగా గత ఏడాది నుంచి విద్యా సంస్థలు మూతపడ్డాయి. మధ్యలో కొంతకాలం మినహా దాదాపు 18 నెలలుగా ఆన్‌లైన్ పద్ధతిలోనే విద్యా బోధన సాగుతోంది.. అయితే, ప్రత్యక్ష బోధనకు అనుమతించాలంటూ విద్యా సంస్థల యాజమాన్యాల నుంచి ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతూ వస్తోంది.. కోవిడ్ తీవ్రత తగ్గిందని, విద్యా సంస్థలను తిరిగి ప్రారంభించేందుకు సరైన వాతావరణం నెలకొందని వైద్య ఆరోగ్య శాఖ సైతం పేర్కొంది. పలు ఇతర రాష్ట్రాలు ఇప్పటికే కోవిడ్ మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రత్యక్ష…