హైదరాబాద్‌లో రెండు ప్రాంతాల్లో నిర్వహించిన డ్రంక్ డ్రైవ్ పరీక్షల్లో స్కూల్ బస్సు డ్రైవర్లు పట్టుబడ్డారు.. యూసఫ్ గూడ బస్తీలో ట్రాఫిక్ పోలీసుల డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించారు.. అయితే..ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ లో క్వీన్స్, ప్రిజం స్కూల్ బస్సు డ్రైవర్లు పట్టుబడ్డారు. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లో డ్రైవర్ కు 156 రీడింగ్ వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. దీంతో బస్సును స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు మందు బాబుల వ్యవహారం తల నోప్పిగా మారింది. మందేస్తే చిందే అన్నట్లు.. మందుబాబుల ఆగడాలు నగరంలో మితిమీరుతున్నాయి. మద్యం సేవించి పోలీసులకు సవాల్ విసురుతున్నారు మందుబాబులు. అర్థరాత్రి అయ్యందంటే మందుబాబులు రెచ్చిపోతున్నారు. ఫుల్ గా తాగి రోడ్డుపై హల్‌చల్ చేస్తూ.. ప్రజలను, పోలీసులకు తలనొప్పిగా మారుతున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చట్టప్రకారం నేరమే అయినా తాగిన మత్తులో డ్రైవ్ చేస్తూ ప్రాణాలమీదకు తెచ్చకుంటున్నారు. వారిని ఆపిన పోలీసులతో వాగ్వాదానికి దిగుతున్నారు. ఇటీవలే మలక్పేట్…