మహిళల టీ20 ప్రపంచకప్ 2024లో భారత్ కథ ముగిసింది. న్యూజిలాండ్‌పై పాకిస్థాన్ గెలిస్తే.. సెమీస్ అవకాశాలు ఉంటాయని ఆశించిన టీమిండియాకు నిరాశే మిగిలింది. గ్రూప్-ఏ చివరి లీగ్ మ్యాచ్‌లో కివీస్ 54 పరుగుల తేడాతో పాక్‌ను ఓడించి నాకౌట్ చేరింది. ఆస్ట్రేలియా అప్పటికే సెమీస్ బెర్త్ ఖరారు చేసుకోవడంతో.. భారత్, పాకిస్తాన్ టోర్నీ నుంచి నిష్క్రమించాయి. భారత జట్టు ఫామ్, ప్లేయర్స్‌ను చూస్తే కచ్చితంగా సెమీస్ చేరుతుందనుకుంటే.. సీన్ రివర్స్ అయింది. టీ20 ప్రపంచకప్ కోసం బయల్దేరే…