స్టాక్ మార్కెట్‌లో నష్టాల కారణంగా, చాలా మంది ఇప్పుడు సురక్షితమైన పెట్టుబడుల వైపు మొగ్గు చూపుతున్నారు. తక్కువ రిస్కుతో అధిక లాభాలను ఆర్జించాలని భావిస్తున్నారు. తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టి ఎక్కువ రాబడినిచ్చే పథకాల కోసం చూస్తున్నారు. దేశ ప్రజల కోసం పోస్టాఫీసు చిన్న పొదుపు పథకాలను ప్రారంభించింది. ఇవి సురక్షితమైన పెట్టుబడితో పాటు పెట్టుబడిదారులకు హామీతో కూడిన రాబడిని ఇచ్చే పథకాలు. మీరు కూడా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే పోస్టాఫీస్ లో అద్భుతమైన స్కీమ్ అందుబాటులో ఉంది. కేవలం రూ. 5 వేలు పెట్టుబడి పెట్టి లక్షాధికారి కావొచ్చు.
Also Read:Fish Prasadam: మృగశిర కార్తె రోజే చేపమందు ప్రసాదం ఎందుకు పంపిణీ చేస్తారు..?
పోస్టాఫీస్ అందించే పథకాల్లో రికరింగ్ డిపాజిట్ స్కీమ్ (RD స్కీమ్) బెస్ట్ స్కీమ్ అని చెప్పొచ్చు. ఇది 5 సంవత్సరాల మెచ్యూరిటీ వ్యవధితో వస్తుంది. మీరు సమీపంలోని ఏదైనా పోస్టాఫీసుకు వెళ్లి పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్‌లో ఖాతాను తెరవవచ్చు. ఇందులో పెట్టుబడిని రూ. 100 నుంచి ప్రారంభించవచ్చు. పోస్ట్ ఆఫీస్ ఆర్డీ స్కీమ్ మెచ్యూరిటీ వ్యవధి ఐదు సంవత్సరాలు. కావాలనుకుంటే మరో ఐదు సంవత్సరాలు పొడిగించుకోవచ్చు. దీనిలో రుణ సౌకర్యం కూడా ఉంటుంది. ఖాతా ఒక సంవత్సరం పాటు యాక్టివ్‌గా ఉన్న తర్వాత, డిపాజిట్ మొత్తంలో 50 శాతం వరకు రుణంగా తీసుకోవచ్చు. అయితే, రుణంపై వడ్డీ రేటు వడ్డీ రేటు కంటే 2 శాతం ఎక్కువ ఉంటుంది. ఈ పథకంలో 6.7 శాతం వడ్డీ అందిస్తున్నారు.
Also Read:8 Vasantalu : ‘8 వసంతాలు’ నుంచి హార్ట్ టచింగ్ సెకండ్ టీజర్ రిలీజ్..
5 వేలు పెట్టుబడి పెడితే 8 లక్షల లాభం
ఈ పథకంలో ప్రతి నెలా రూ. 5,000 రూపాయలు పెట్టుబడి పెడితే, ఐదు సంవత్సరాలలో, మీరు మొత్తం 3 లక్షల రూపాయలు జమ చేస్తారు. 6.7 శాతం రేటుతో, దానిపై వడ్డీ రూ. 56,830 అవుతుంది. అంటే మొత్తంగా, మీ నిధి ఐదు సంవత్సరాలలో రూ. 3,56,830 అవుతుంది. ఇప్పుడు మీరు RD ఖాతాను మరో ఐదు సంవత్సరాలు పొడిగిస్తే, మీరు 10 సంవత్సరాలలో జమ చేసిన మొత్తం రూ. 6,00,000 అవుతుంది. దీనితో పాటు, ఈ డిపాజిట్‌పై 6.7 శాతం వడ్డీ మొత్తం రూ. 2,54,272 అవుతుంది. ఈ విధంగా, 10 సంవత్సరాల కాలంలో మీ చేతికి రూ. 8,54,272 వస్తుంది.