భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ హాత్ సే హాత్ జోడో పేరుతో ములుగు నియోజకవర్గం నుంచి పాదయాత్రను ప్రారంభించారు. అయితే.. ఈ యాత్ర ములుగు నియోజకవర్గంలో రెండు రోజులు కొనసాగింది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రగతి భవన్ పదెకరాల విస్తీర్ణంలో 110 గదులతో కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించారని.. కానీ ప్రగతి భవన్ పేద ప్రజలకు ఉపయోగపడదన్నారు. ఆ భవనం ఉన్నా ఒకటే లేకున్నా ఒకటేనని భవనాన్ని నక్సలైట్లు పేల్చేయాలన్నారు. గతంలో మావోలు దొరల గడీలను పేల్చి వేసినట్టు ప్రగతి భవన్ ను కూడా పేల్చివేయాలని.. నక్సలైట్లు ప్రగతి భవన్ ను పేల్చివేస్తే మాకు ఎలాంటి నష్టం లేదని అన్నారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దుమారం లేపుతున్నాయి. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు బీఆర్‌ఎస్ శిబిరంలోని నేతలకు కోపం తీసుకువచ్చింది. దీంతో.. బీఆర్‌ఎస్ నేతలు డీజీపీకి ఫిర్యాదు చేశారు.
Also Read : Errabelli Dayakar Rao : రేవంత్ రెడ్డిని తెలంగాణ ప్రజలు ఐటమ్ సాంగ్ లెక్కనే చూస్తారు
ఈ క్రమంలో తాజాగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు వ్యక్తిగతమా? పార్టీ లైనా? అని ప్రశ్నించారు. నక్సలైట్లను నిషేధించిందే కాంగ్రెస్ పార్టీ.. మరి రేవంత్ రెడ్డి వ్యాఖ్యల వెనుక అంతర్యం ఏంటి? అని ఆమె అన్నారు. అనర్హుడైన రేవంత్ రెడ్డికి పీసీసీ ఇస్తే ఇలాంటి గతి పడుతుందనడానికి ఇదే ఉదాహరణ అని ఆమె అన్నారు. ఇలానే రేవంత్ రెడ్డి మాట్లాడుకుంటూ పోతే… భవిష్యత్ లో తిరగలేవని ఆమె హెచ్చరించారు. ఒళ్లు దగ్గర పెట్టుకొని రేవంత్ రెడ్డి మాట్లాడితే మంచిదని ఆయన హితవు పలికారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రజలకు క్షమాపణ చెప్పకపోతే రేవంత్ రెడ్డి యాత్ర మానుకోట దాటదు అని అందరికీ తెలుసు అని ఆమె అన్నారు. లేని నక్సలైట్లను ముందు పెట్టి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేయడంలో ఆంతర్యం ఏంటి అని ఆమె అన్నారు.
Also Read : Transgender Pregnant: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన తండ్రి