రాష్ట్రంలో డ్రగ్స్ పైన నిఘా పెట్టాలని, ఈగల్ ఉందని డ్రగ్ కంట్రోల్ అధికారులు ఆగాల్సిన పని లేదని ఏపీ వైద్య ఆరోగ్య శాఖామంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. డ్రగ్స్ పని చేయనివి కూడా మార్కెట్లో దొరుకుతున్నాయని, తనకే అలాంటి పరిస్ధితి ఎదురైందన్నారు. ఎక్స్‌పైరీ మందులు, నిషేధించిన మందులు కూడా దొరుకుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ ప్రభుత్వంలో జనరిక్, జన ఔషధి కేంద్రాలు తీసుకొచ్చారని సత్యకుమార్ తెలిపారు. శ్రీకాకుళం, విశాఖ, అమలాపురం, నరసరావుపేట, ఒంగోలు, కావలి,…