PJR Flyover: హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్య తీరడంతో పాటు సమయం ఆదా చేయడానికి నిర్మించిన మరో ఫ్లైఓవర్ నేటి (జూన్ 28) నుంచి అందుబాటులోకి రానుంది. పీజేఆర్ ఫ్లైఓవర్ ఇవాళ సాయంత్రం 4 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ప్రారంభించనున్నారు.
Miss World 2025 : ప్రతిష్ఠాత్మక మిస్ వరల్డ్ పోటీలు జరుగుతున్న క్రమంలో.. అలాగే దేశవ్యాప్తంగా ‘ఆపరేషన్ సింధూర్’ నేపథ్యంలో హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ఉన్న ట్రైడెంట్ హోటల్‌లో భద్రతను అత్యంత కట్టుదిట్టం చేశారు. ఈ హోటల్‌లోనే మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొంటున్న అందమైన కంటెస్టెంట్‌లు బస చేస్తున్నారు. ట్రైడెంట్ హోటల్ భద్రతా బాధ్యతలను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. హోటల్‌లో ఆక్టోపస్ టీమ్‌తో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. సైబరాబాద్ పోలీసులు హోటల్‌లో పకడ్బందీగా భద్రతను ఏర్పాటు…
సంవత్సరం మొత్తం ఎక్కడ ఉన్నా కానీ సంక్రాంతికి సొంత ఊరికి వెళుతుంటారు చాలా మంది. మరీ ముఖ్యంగా హైదరాబాద్ నగరం నుంచి చాలా మంది సొంతుళ్లకు పరుగులు తీస్తుంటారు. పట్నం సగానికి పైగా ఖాళీ అవుతుంది. కాగా.. కొందరు మాత్రం పనులు, వివిధ కారణాల వల్ల ఊరికి వెళ్లలేకపోతారు. అలాంటి వారికి శిల్పారామంలో వేడుకలు ఊరట కలిగిస్తున్నాయి.
అతి వేగానికి ఇద్దరు యువకులు బలయ్యారు. మాదాపూర్ పరిధిలో బైక్ అదుపుతప్పి డివైడర్ ఢీకొని ఇద్దరు యువకులు మృతి చెందారు. అయ్యప్ప సొసైటీ 100 ఫీట్ రోడ్లో బుల్లెట్ బైక్‌పై వేగంగా ఇచ్చిన ఇద్దరు యువకులు డివైడర్‌ను ఢీకొట్టి రోడ్డుపై పడ్డారు.
మాదాపూర్ సిద్దిక్ నగర్ లో 5 అంతస్తుల భవనం ఓవైపునకు ఒరిగింది. ఈ భవనాన్ని కూల్చి వేసేందుకు రంగం సిద్ధమైంది. నిన్న రాత్రి 8:10 నిమిషాలకు పెద్ద శబ్దంతో 60 గజాల స్థలంలో ఒరిగింది. సరైన నిర్మాణ ప్రమాణాలు పాటించకుండా ఇంటి నిర్మాణ కోసం పక్కకే 150 గజాల స్థలంలో పిల్లర్ పూట్టింగ్ కోసం పెద్ద గుంత తవ్వడంతో ఈ భవనం వంగినట్లు చెబుతున్నారు.
మాదాపూర్ లో మరో సాఫ్ట్ వేర్ కంపెనీ బోర్డు తిప్పేసింది. మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అయ్యప్ప సోసైటీ 100 ఫీట్ రోడ్ లో ఫ్రైడే అప్ కన్సల్టెన్సీ పేరుతో కంపెనీని కేటుగాళ్లు నిర్వహించారు. కన్సల్టేషన్ కంపెనీ దాదాపు 600 మందికి పైబడిన నిరుద్యోగుల నుంచి రూ.1లక్ష , రూ. 50,000 వేల రూపాయల చొప్పున వసూలు చేసింది.
Fake IPS Officer: నకిలీ ఐపీఎస్ అధికారి రామ్‌ను సైబరాబాద్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. తక్కువ ధరకు ఉద్యోగాలు, కార్లు ఇప్పిస్తానని నిందితులు పలువురిని మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. సెటిల్‌మెంట్ల కోసం హైదరాబాద్‌లో ఓ నకిలీ ఐపీఎస్ అధికారి రామ్ కార్యాలయం తెరిచాడు.
Carden search: నగరంలోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మస్తాన్‌నగర్‌లో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. మాదాపూర్ డీసీపీ శిల్పావళి ఆధ్వర్యంలో అదనపు డీసీపీ, ఒక ఏసీపీ, 11 మంది సెర్చ్ పార్టీలు, 150 మంది పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు.
తెలంగాణ యంగెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా అని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ మాదాపూర్‌లో జరుగుతున్న వెజ్ ఆయిల్, ఆయిల్ సీడ్ రంగంపై గ్లోబల్ రౌండ్ టేబుల్ సదస్సుకు మంత్రి మంత్రులు కేటీఆర్, నిరంజన్ రెడ్డి హాజరయ్యారు.