సంవత్సరం మొత్తం ఎక్కడ ఉన్నా కానీ సంక్రాంతికి సొంత ఊరికి వెళుతుంటారు చాలా మంది. మరీ ముఖ్యంగా హైదరాబాద్ నగరం నుంచి చాలా మంది సొంతుళ్లకు పరుగులు తీస్తుంటారు. పట్నం సగానికి పైగా ఖాళీ అవుతుంది. కాగా.. కొందరు మాత్రం పనులు, వివిధ కారణాల వల్ల ఊరికి వెళ్లలేకపోతారు. అలాంటి వారికి శిల్పారామంలో వేడుకలు ఊరట కలిగిస్తున్నాయి.